ఓ వైపు నిప్పుల కొలిమిలా భానుడు విరుచుకుపడుతుంటే.. ఆస్పత్రిలో ఏసీలు, ఫ్యాన్లు పని చేయక ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు కామారెడ్డి జిల్లా ప్రభుత్వాస్ప్రతి రోగులు. మాతాశిశు సంరక్షణ, అత్యవసర చికిత్స విభాగాలలో ఏసీలు, కొన్ని చోట్ల ఫ్యాన్లు పని చేయడం లేదు. దీంతో ఆస్పత్రిలో అడ్మిట్ అయిన రోగలతో పాటు వారి బంధువులు ఉక్కపోతకు ఇబ్బందులు పడుతున్నారు. మాతాశిశు సంరక్షణ విభాగంలో బాలింతలు, చిన్న పిల్లలు ఉండటంతో వారు మరింత అవస్థలు పడుతున్నారు. కొందరు ఉక్కపోత భరించలేక ఇంటి నుంచే సొంతంగా టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకునే పరిస్థితి నెలకొంది. దీంతో పాటు నీటి సమస్య కూడా ఉండటంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఫ్యాన్లు, ఏసీలు రిపేర్ చేయించి ఉక్కపోత నుంచి ఉపశమనం కల్పించాలని.. అలాగే నీటి సమస్య తలెత్తకుండా చూడాలని కోరుతున్నారు.


