16.7 C
Hyderabad
Saturday, February 14, 2026
spot_img

ప్రియాంక గాంధీ వయనాడ్ లో ఘన విజయం సాధించాలి – సీతక్క

త్యాగాల కుటుంబం నుంచి వచ్చిన మహిళా నేత, ప్రియాంక గాంధీ వయనాడ్‌లో ఘనవిజయం సాధించాలని..తెలంగాణ పంచాయతీరాజ్ మంత్రి సీతక్క ఆకాంక్షించారు. కుటుంబ సమేతంగా ఆమె నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక మొక్కులు చెల్లించుకోవాలని అనేక సార్లు అనుకున్నట్లు తెలిపారు. నేడు ఆ మొక్కులు చెల్లించుకునే భాగ్యం దక్కిందన్నారు. ఇరు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో ముందుకెళ్లాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు. అంతకుముందు తెలంగాణ మంత్రికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదశీర్వచనం అందజేశారు. శ్రీవారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో మంత్రిని సత్కరించారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్