30.3 C
Hyderabad
Friday, March 13, 2026
spot_img

రాయ్ బరేలీనుంచి ప్రియాంక, అమేథీ నుంచి రాహుల్ పోరుకు సిద్ధం

ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ కంచుకోట గా భావించే రాయ్ బరేలీ, అమేథీ పై తమ పట్టు నిలుపుకోవాలని గాంధీ ఫ్యామిలీ నిర్ణయించుకుంది. మొన్నటి వరకూ కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రాతినిధ్యం వహించిన రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రియాంక గాంధీ వద్రా పోటీ చేస్తారు. అలాగే అమేథి నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయించుకున్నారు. రాహుల్ కేరళలోని వయినాడ్ నుంచి లోక్ సభకు పోటీలో ఉన్నారు. ఇప్పటికే అక్కడి పోలింగ్ ప్రక్రియ ముగిసింది.

ప్రియాంక గాంధీ వద్రా ఎన్నికల రాజకీయాల్లో అరంగేట్రం చేయాలని నిర్ణయించారు. రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి ఆమె లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తారు. అమేథీ, రాయ్‌ బరేలీ నియోజకవర్గాల కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై సస్పెన్స్‌ వీడింది. అమేథీ నుంచి కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ, రాయ్‌ బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తున్నట్లు ఏఐసీసీ ఓ ప్రకటన చేసింది. ఇప్పటికే రాహుల్‌ గాంధీ లోక్‌సభ ఎన్నికల్లో కేరళలోని వాయనాడ్‌ నుంచి పోటీ చేశారు, అక్కడి పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. కాగా బీజేపీ బీజేపీ అమేథీ అభ్యర్థిగా కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ నామినేషన్‌ వేశారు.

రాయ్ బరేలీ దాదాపు 70 ఏళ్లుగా గాంధీ కుటుంబానికి గొప్ప అనుబంధం. చరిత్ర ఉంది. ప్రియాంక గాంధీ తాత.. రాహుల్ గాంధీ తండ్రి ..ఇందిరాగాంధీ భర్త అయిన ఫిరోజ్ గాంధీ 1952 లో తొలిసారిగా రాయ్ బరేలీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. మళ్లీ 1957 లోనూ అదే స్థానం నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. 1960 సెప్టెంబర్ 8న మరణించారు. అనంతరం కొద్దికాలం బైజ్ నాథ్ కురీల్ ప్రాతినిధ్యం వహించారు. 1967 నుంచి ఫిరోజ్ గాంధీ సతీమణి, అప్పటి ప్రధాని అయిన ఇందిరాగాంధీ రాయ్ బరేలీకి ప్రాతినిధ్యం వహించారు. 1971 లోనూ, 1980 లోనూ ఇందిరా గాంధీ ఇక్కడి నుంచి ఎన్నికయ్యారు. తర్వాతి కాలంలో గాంధీ కుటుంబానికి సన్నిహితులైన అరుణ్ నెహ్రూ, షీలా కౌల్, సతీశ్ శర్మ వంటి వారు ప్రాతినిధ్యం వహించినా, కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టిన తర్వాత సోనియాగాంధీ 2004, 2009, 2014, 2019 లో రాయ్ బరేలీ నుంచి ఎన్నికయ్యారు. సోనియాగాంధీ 2024లో రాజ్యసభకు ఎన్నిక కావడంతో ఆ స్థానే ప్రియాంక గాంధీ వద్రాను పోటీకి నిలపాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.

అమేథీ లోక్ సభ నియోజకవర్గం కూడా కాంగ్రెస్ కుటుంబానికి కంచుకోటే. 1980లో ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ తొలిసారిగా అమేథీ నుంచి ఎన్నికయ్యారు ఆయన మరణానంతరం రాజీవ్ గాంధీ 1981 నుంచి 1991 వరకూ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. 1991లో రాజీవ్ గాంధీ మరణం తర్వాత 1999 లో సోనియా గాంధీ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. 2004, 2009, 2014 లో వరుసగా రాహుల్ గాంధీ అమేథీ నుంచి ఎన్నికవుతూ వచ్చారు. 2019 లోక్ సభ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విజయం సాధించడంతో గాంధీ కుటుంబం విజయ పరంపరకు అడ్డుకట్ట పడుతూ వచ్చింది. మళ్లీ 2024 లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ .. నియోజకవర్గంపై తన పట్టు సడలనివ్వరాదన్న కృత నిశ్చయంతో మళ్లీ పోటీ చేస్తున్నారు.

ప్రియాంక గాంధీ వద్రా మొదటి నుంచి కాంగ్రెస్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనలేదు. సోనియాగాంధీ రాయ్ బరేలీలో పోటీ చేసినప్పుడు ఆమె తరుపున ప్రచారానికే పరిమితమయ్యారు. 2019లో కాంగ్రెస్ రెండోసారి ఓటమి, రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో ..సోనియాగాంధీ మళ్లీ కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టవలసి వచ్చింది. సోనియాగాంధీ ఆరోగ్యం కూడా సహకరించని వేళ.. ప్రియాంక తల్లికి అండగా నిలిచి, రాజకీయాల్లో కొంత పాల్పంచుకుంటూ వచ్చారు. 2022 లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా పార్టీ ప్రచారంలో పాల్గొన్నారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర, భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు సోనియాగాంధీకి రాజకీయ సలహాదారుగా పనిచేశారు. కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ మరణానంతరం.. పార్టీ వ్యవహారాల్లో ఆ పాత్రను వహించే కృషిలో ఉన్నారు. నిరుడు హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్టార్ కాంపేనర్ గా బాధ్యతలు వహించారు.

ఉత్తరప్రదేశ్ లో 80 లోక్ సభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో ఇండియా కూటమి లో భాగంగా సమాజ్ వాదీ పార్టీ, కాంగ్రెస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఎస్పీ 61 స్థానాల్లో పోటీ చేస్తుండగా కాంగ్రెస్ రాయ్ బరేలీ, అమేథీతో పాటు 17 స్థానాల్లో పోటీ చేయనుంది. ఈ సీట్ల పంపిణీ చర్చలలోనూ ప్రియాంక కీలక పాత్రవహించడం విశేషం. రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకు మే 20న లోక్ సభఎన్నికలు ఐదో దశలో ఎన్నికలు జరుగుతాయి. నామినేషన్ల ప్రక్రియ ఏప్రిల్ 26న మొదలైంది. మే 3 నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ.

రాయ్ బరేలీ, అమేథీ నుంచి ప్రియాంక గాంధీ వద్రా, రాహుల్ ఎన్నికల బరిలో దిగడంతో ఇతర నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న కాంగ్రెస్ నాయకులకు కొత్త ఊపు వచ్చింది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాయ్ బరేలీ, అమేథీలో ప్రజల నాడి పట్టుకునే యత్నం చేసింది. అక్కడి ప్రజలు రాహుల్, ప్రియాంక గాంధీ పోటీ చేయాలని కోరుతున్నారని సర్వేలో వెల్లడైంది. ఇక ప్రచారం హోరు మొదలైన తర్వాత.. విజయావకాశాలు అంచనా వేయవచ్చు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్