26.7 C
Hyderabad
Tuesday, July 8, 2025
spot_img

జైలును బద్దలు కొట్టుకొని తప్పించుకున్న ఖైదీలు

    హైతీ రాజధాని పోర్ట్‌ అ ప్రిన్స్ రణరంగాన్ని తలపిస్తోంది. తీవ్రమైన నేరాలు చేసిన వారిని బంధించే జైలును బద్దలు కొట్టుకొని వందలమంది ఖైదీలు తప్పించుకొన్నారు. కెన్యాతో ఓ రక్షణ ఒప్పందం చేసుకోవడానికి ప్రధాని ఏరియల్‌ హెన్రీ ఇటీవల పర్యటనకు వెళ్లారు. ఆ సమయంలో దేశ రాజధానిలో నేరగాళ్ల ముఠాలు ఒక్కసారిగా రెచ్చిపోయాయి. పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను వీరు లక్ష్యంగా చేసుకొని దాడులు మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో అమెరికా విమానయాన సంస్థలు సర్వీసులను రద్దు చేశాయి. ఇదే సమయంలో దేశంలోనే అత్యంత తీవ్రమైన నేరగాళ్లను ఉంచే పోర్ట్‌ అ ప్రిన్స్‌ జైలుపై దాడులు మొదలయ్యాయి. ఈ జైల్లో దేశాధ్యక్షుడి హంతకులతోపాటు18మంది కొలంబియా వాసులు ఉన్నారు. దీని సామర్థ్యం 3,900 కాగా.. 11,778 మంది ఖైదీలు ఇక్కడ ఉన్నారు. ఈ నేపథ్యంలో జైలుపై దుండగులు దాడి నిర్వహించారు. దీనిలో బాజ్‌-5 ముఠా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్