33.2 C
Hyderabad
Tuesday, March 11, 2025
spot_img

కాసేపట్లో ఘటన స్థలానికి ప్రధాని

స్వతంత్ర వెబ్ డెస్క్: ఒడిశా రైలు ప్రమాదాలపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంత్రి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అధికారులతో కలిసి ప్రమాద ఘటనపై ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం రైల్వే మంత్రితో మాట్లాడిన ఆయన సహాయక చర్యలకి ఎటువంటి ఆటంకం కలగకుండా చూసుకోవాలని ఆదేశించారు. ఇక ఘటనా స్థలిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న ప్రధాని.. కాసేపట్లో సంఘటనా స్థలానికి చేరుకోనున్నారు. ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్నారు. ఇక ఒడిశా రైలు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్పందించారు. రైలు ప్రమాదంలో ఇంత మంది మరణించడం తన మనసును కలిచి వేసిందని ఆమె ట్వీట్ చేశారు. గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్టు చెప్పారు. ప్రమాదం జరిగిందని తెలిశాక తీవ్ర ఆవేదనకు లోనయ్యాయని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతదేహాల తరలింపు కోసం భరత్ వాయుసేన రంగంలోకి దిగింది. ఎంఐ -17 హెలికాఫ్టర్ల ద్వారా మృతదేహాలను తరలించేందుకు అధికారులు ఏర్పాటు చేసారు. కాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో జాతీయ విపత్తు నిర్వహణ దళాలు సహాయక చర్యలు చేపడుతున్నాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. బాధితులకు ఆయన సంఘీభావం తెలిపారు. ఎన్డీఆర్‌ఎఫ్‌తో పాటూ రాష్ట్ర సహాయక బృందాలు, ఎయిర్‌ఫోర్సు కూడా సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నట్టు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రమాదంఫై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు. ఇక క్రికెటర్ కోహ్లీ, కెనడా ప్రధాని జస్టిస్ ట్రూడో, టైవాన్ అధ్యక్షురాలు సాయి యంగ్ వెన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ విషాద సమయంలో తన ఆలోచనలు బాధిత కుటుంబ సభ్యులు చుట్టే ఉన్నాయని ట్రూడో ట్వీట్ చేసారు. అటు ఆస్ట్రేలియా, శ్రీలంక విదేశాంగ మంత్రులు కూడా ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్