22.2 C
Hyderabad
Thursday, December 26, 2024
spot_img

నేడు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. ఆసక్తికరంగా మారిన ప్రసంగం

స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు(మంగళవారం) తెలంగాణలో పర్యటించనున్నారు. కర్ణాటక రాష్ట్రం బీదర్ నుంచి నిజామాబాద్ జిల్లాకు రానున్నారు. జిల్లాలో రూ.8 వేల కోట్ల విలువైన పనులకు వర్చువల్‌ విధానంలో శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అనంతరం జరిగే బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. బీఆర్‌ఎస్, ఎంఐఎంతోపాటు కాంగ్రెస్‌పైనా విమర్శలు ఉంటాయంటుని బీజేపీ పార్టీ నేతలు అంటున్నారు.

కాగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే తెలంగాణలో మోదీ రెండోసారి పర్యటిస్తున్నారు. ఈ నెల 1న మహబూబ్‌నగర్‌లో రూ.13,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపిన ప్రధాని.. మంగళవారం నిజామాబాద్‌లో నిర్వహించే కార్య­క్రమాల్లో పాల్గొననున్నారు. తర్వాత ఇక్కడి గిరిరాజ్‌ కాలేజీ మైదానంలో నిర్వహించే బీజేపీ బహిరంగ సభలో రాజకీయ ప్రసంగం చేయనున్నారు. పాలమూరు పర్యట­నలో బీఆర్‌ఎస్, ఎంఐఎంలపై విమర్శలు గుప్పించిన ప్రధాని మోదీ.. నిజామా­బాద్‌­లో ఏం మాట్లాడుతారు, ఎలాంటి విమ­ర్శలు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

ఇదిలా ఉండగా ఇప్పటికే ఇందూరుకు ప్రధాని  పసుపు బోర్డు ప్రకటించిన నేపథ్యంలో నిజామాబాద్‌ సభకు హాజరై కృతజ్ఞతలు చెప్తామని పసుపు రైతులు చెబుతున్నారు. దీనికి నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్‌ జిల్లాల నుంచి పసుపు రైతులు భారీగా తరలిరానున్నారు.

ఇక ఈ ఏడాది చివరలో తెలంగాణతో పాటు మరో ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.  అందులో రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలు కావడం, తెలంగాణలోనూ ఆ పార్టీలో జోష్‌ కనిపిస్తుండటంతో..ఈ సారి కాం­గ్రెస్‌ పార్టీపైనా మోదీ విరుచుకుపడే అవ­కా­­శం ఉందని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. అంతేగాక గత లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో 3 ఎంపీ స్థానాలు గెలుచు­కున్న బీజేపీ ఈసారి మరింత పట్టుపెంచుకునే దిశ గా నిజామాబాద్‌లో సభ, ప్రధానితో వరాల ప్రకటన చేపట్టినట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

ప్రధాని మోదీ షెడ్యూల్‌

  • మంగళవారం మధ్యాహ్నం 2.55 గంటలకు ఎంఐ–17 సైనిక హెలికాప్టర్‌లో నిజామాబాద్‌కు చేరుకుంటారు.
  • 3 గంటలకు ఇక్కడి గిరిరాజ్‌ ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్స్‌లో తొలి వేదిక వద్దకు చేరుకుంటారు.
  • 3.35 గంటలదాకా వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
  • 3.45 గంటలకు పక్కనే ఉన్న బహిరంగ సభా వేదిక వద్దకు చేరుకుంటారు
  • 4.45 గంటల దాకా సభలో పాల్గొని ప్రసంగిస్తారు.
  • సాయంత్రం 5 గంటలకు నిజామాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో తిరుగుప్రయాణం అవుతారు.

అభివృద్ధి కార్యక్రమాలు ఇవీ..

*నిజామాబాద్‌ పర్యటనలో మొత్తం రూ.8,021 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రధాని మోదీ వర్చువల్‌గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అందులో ప్రాజెక్టులు, పథకాలు ఇవీ…

*పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎన్టీపీసీ నిర్మించిన అల్ట్రా సూపర్‌ క్రిటికల్‌ థర్మల్‌ విద్యుత్‌ ప్లాంట్‌లో 800 మెగావాట్ల తొలి యూనిట్‌ను జాతికి అంకితం చేస్తారు.

 *‘ప్రధానమంత్రి ఆయుష్మాన్‌ భారత్‌ హెల్త్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మిషన్‌’ కింద రూ.516.5 కోట్లతో తెలంగాణలోని 20 జిల్లా కేంద్ర ఆస్పత్రుల్లో నిర్మించనున్న 50 పడకల క్రిటికల్‌ కేర్‌  విభాగాలకు శంకుస్థాపన చేస్తారు.

*రూ.1,200 కోట్లతో 76 కిలోమీటర్ల పొడవునా నిర్మించిన సిద్దిపేట–మనోహరాబాద్‌ రైల్వేలైన్‌ను..సిద్దిపేట–సికింద్రాబాద్‌ వరకు తొలి రైలు సర్వీసును ప్రారంభిస్తారు.

*(ధర్మాబాద్‌ మహారాష్ట్ర)–­మనోహరాబాద్‌–మహబూబ్‌నగర్‌–కర్నూల్‌(ఏపీ)’ రైల్వేలైన్‌లో రూ.305 కోట్లతో 348 కిలోమీటర్ల మేర చేపట్టిన విద్యుదీకరణ పనులను జాతికి అంకితం చేస్తారు.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్