ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి బాధ్యతలు చేపట్టారు. సౌత్ బ్లాక్ పీఎంవో కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. ప్రధాని మోదీకి సౌత్ బ్లాక్ సిబ్బంది చప్పట్లతో స్వాగతం పలికారు. అనంతరం పీఎం కిసాన్ నిధి విడుదల చేస్తూ ఫైల్‌పై తొలి సంతకం చేశారు మోదీ. 9.3 కోట్ల మంది రైతులకు 20వేల కోట్ల ఆర్థిక సాయం విడుదల చేశారు. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా మోదీ చెప్పారు. ముందు ముందు రైతుల సంక్షేమానికి మరిన్ని కార్యాక్రమాలు చేపడతామన్నారు.కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్రపతి భవన్‌లో నిన్న సాయం త్రం అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేశారు. మొత్తం 72 మంత్రులతో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. ఎవరెవరికి ఏ శాఖ కేటాయించారనే దానిపై కాసేపట్లో స్పష్టత రానుంది. అనంతరం మంత్రులకు సమాచారం ఇవ్వనుంది PMO కార్యాలయం. సాయంత్రం మోదీ అధ్యక్షతన తొలిసారి కొత్త కేబినెట్ భేటీ కానుంది. ప్రభుత్వ విధానాలపై మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు మోదీ. అంతేకాకుండా వంద రోజుల యాక్షన్ ప్లాన్‌పై చర్చించనున్నారు.