స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. మహారాష్ట రాష్ట్రం బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో మనోహరాబాద్-సిద్ధిపేట రైల్వే లైన్‌ను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఇందూలో నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు.