శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో సినిమా రూపొందింది. బస్తీ నేపథ్యంలో సాగే యూత్‌ఫుల్ ప్రేమ కథాంశమిది. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పాన్ ఇండియా చిత్రంగా 5 భాషల్లో నిర్మించారు. ఈ చిత్రం తెలుగు వెర్షన్‌ని జూన్ 7న విడుదల చేస్తున్నారు.ఆ తర్వాత, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ చేయటానికి కూడా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా ఆదివారం నాడు మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేశారు.
ఇది వరకు రిలీజ్ చేసిన టీజర్,పోస్టర్, సాంగ్స్‌తో సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. తెలిసీ తెలియని వయసులో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా ఈ మూవీని రా అండ్ రస్టిక్‌గా తెరకెక్కించారని అర్థం అవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ను చూస్తే పూర్తి కథను వివరించినట్టుగా తెలుస్తోంది.
స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను చూపించారు.ఇక ట్రైలర్‌లోని విజువల్స్, డైలాగ్స్ ఎంతో నేచురల్‌గా ఉన్నాయి. సమాజాన్ని తట్టిలేపేలా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది.
నటీనటులు:
అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు
సాంకేతిక వర్గం:
రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వం – శిరిన్ శ్రీరామ్, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ – జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ – కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ – చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ – హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే – శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, అసోసియేట్ డైరెక్టర్ – సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ – అజయ్(ఏజే ఆర్ట్స్), వి.ఎఫ్.ఎక్స్- వి.అంబికా విజయ్, సౌండ్ : సింక్ సినిమా, చెన్నై, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూసర్: నిఖిలేష్ తొగరి, పి.ఆర్.ఒ – చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల.