21.7 C
Hyderabad
Friday, December 27, 2024
spot_img

‘ప్రేమ విమానం’ చూశాక అందరికీ ఆ ఫీలింగ్ వస్తుంది: అనసూయ

గూఢచారి, కేశవ, రావణాసుర వంటి సినిమాలతో పాటు డెవిల్, గూఢచారి 2 వంటి భారీ బడ్జెట్స్‌తో వైవిధ్యమైన సినిమాలను నిర్మిస్తోన్న ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో కలిసి సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్‌ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయటానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. అయితే ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో చిన్న పిల్లలుగా నిర్మాత అభిషేక్ నామా తనయులు దేవాన్ష్ నామా, అనిరుధ్ నామా నటించారు. సంతోష్ కాటా దర్శకత్వం వహించారు. వెన్నెల కిషోర్, అనసూయ భరద్వాజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీ ప్రీమియర్ షోని మంగళవారం మీడియాకు ప్రదర్శించారు. అనంతరం చిత్రయూనిట్ మీడియాతో ముచ్చటించింది.

ఈ క్రమంలో… డైరెక్టర్ సంతోష్ కాటా మాట్లాడుతూ.. ‘‘నేను విమానం ఇంత వరకు ఎక్కలేదు.. సినిమా చేశాకే విమానం ఎక్కాలని ఫిక్స్ అయ్యా.. సినిమా హిట్ అయితేనే బ్యాంక్ అకౌంట్ తీసుకోవాలని అనుకున్నా. ఈ చిన్న పిల్లలు ఆ పాత్రలను అద్భుతంగా పోషించారు. నిర్మాత పిల్లలనే ఉద్దేశంతో సినిమాలోకి తీసుకోలేదు. ఆ పిల్లలు చాలా కష్టపడ్డారు. పిల్లల నటన చూసి అభిషేక్ నామా గారు చాలా సంతోషించారు. విలేజ్‌కి వెళ్లి షూటింగ్ చేసినప్పుడు ఎన్నో సరదా సంఘటనలు, చిన్న చిన్న గొడవలు కూడా జరుగుతుంటాయి. మేం ఎంత కష్టపడ్డా కూడా సినిమాను చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాం. మా కష్టం అంతా ఎగిరిపోయినట్టుగా అనిపించింది. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన జీ5 టీం, అభిషేక్ నామా గారికి థాంక్స్. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నాకు సపోర్ట్‌గా నిలిచిన టీంకు థాంక్స్.’’ అని అన్నారు.

అనసూయ మాట్లాడుతూ.. ‘‘కొన్ని సార్లు దర్శకులు చెప్పిన కథకు, తీసిన దాంట్లో తేడా ఉంటుంది. కానీ సంతోష్ మాత్రం ఏం చెప్పాడో.. ఎలా చెప్పాడో అదే తీశాడు. మొదటి సినిమా దర్శకుడిలా కనిపించలేదు. సెట్‌లు ఎక్కువగా వేయలేదు. అంతా నేచురల్‌గా షూట్ చేశారు. చిన్న పిల్లలు షూటింగ్‌ను ఎంతో కష్టపడి చేశారు. నేను ప్రతీ సారి కొత్తగా ఉండే కథలను ఎంచుకుంటూ వస్తాను. నా బలం గ్లామర్ అని కొంత మంది అంటారు. కొంత మంది తిడుతారు. సినిమాలో అయినా నిజ జీవితంలో అయినా ఆనందంగా ఉండేందుకు నాకు నచ్చిన పాత్రలు, పనులు చేస్తాను. ఈ సినిమా సెట్‌లో అంతా పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. శాంతమ్మ పాత్ర నాకు ఇచ్చినందుకు సంతోష్‌కు థాంక్స్. ఈ ప్రయాణం వల్ల ఈ చిత్రంతో ప్రేమలో పడిపోయాను. మంచి సినిమా చూశామనే ఫీలింగ్ మాత్రం అందరికీ వస్తుంది. మా ప్రేమ విమానంను అక్టోబర్ 12న జీ5లో అందరూ వీక్షించండి’’ అని అన్నారు.

జీ 5 కంటెంట్ హెడ్, వైస్ ప్రెసిడెంట్ సాయి తేజ్ మాట్లాడుతూ.. ‘‘వెబ్ ఫిల్మ్స్ వద్దు అనుకున్న టైంలోనే సంతోష్ వచ్చి ఈ కథ చెప్పాడు. గట్టిగా అనుకుంటే ఏమైనా చేయొచ్చు అనేది సంతోష్ నమ్మాడు. అందుకే ఈ ప్రేమ విమానం ఓకే అయింది. ఆయన రైటింగ్ ఎంతో బాగుంది. అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను అద్భుతంగా నిర్మించింది. మ్యాడ్ మూవీతో సంగీత్ శోభన్ ఆల్రెడీ థియేటర్లో హిట్ ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ ఓటీటీలో హిట్టు ఇవ్వబోతోన్నాడు. కుటుంబం అంతా కలిసి చూడదగ్గ చిత్రం’’ అని అన్నారు.

ఆర్ట్ డైరెక్టర్ గాంధీ మాట్లాడుతూ.. ‘‘డైరెక్టర్ సంతోష్ ఈ సినిమాను ఎంతో బాగా తీశాడు. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. దర్శకుడు కథ ఎలా చెప్పాడో.. తెరపై అలానే చూపించారు’’ అని అన్నారు.

కెమెరామెన్ జగదీష్ చీకటి మాట్లాడుతూ.. ‘‘మా నిర్మాత అభిషేక్ ఎంతో సపోర్టివ్‌గా ఉన్నారు. ఫిల్మ్ మేకింగ్‌లో ఎన్నో విషయాలు చెప్పారు. నటీనటులంతా అద్భుతంగా పర్పామ్ చేశారు. అమర్ ఎడిటింగ్ బాగుంది. సినిమాను అందరూ ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు.

Latest Articles

‘అనగనగా ఒక రాజు’ ప్రీ వెడ్డింగ్ వీడియో టీజర్ రిలీజ్

యువ సంచలనం నవీన్ పొలిశెట్టి మూడు వరుస ఘన విజయాలతో తెలుగునాట ఎంతో పేరు సంపాదించుకున్నారు. అనతికాలంలోనే అన్ని వర్గాల ప్రేక్షకుల మనసు గెలిచిన కథానాయకుడిగా నిలిచారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్