38.2 C
Hyderabad
Sunday, May 26, 2024
spot_img

ప్రజ్వల్ రేవణ్ణ అశ్లీల వీడియో స్కామ్

  లోక్ సభ ఎన్నికల వేళ.. కర్ణాటకలోని హసన్ కు ప్రాతినిధ్యంవహిస్తున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధిం పులు, అశ్లీల వీడియో కుంభకోణంలో చిక్కుకున్నారు. ఇది కర్ణాటక లో పెద్ద రాజకీయ దుమారం లేపింది. ప్రజ్వల్ రేవణ్ణ జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్ డి దేవెగౌడ మనుమడే. దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ కొడుకు ప్రజ్వల్. లైంగిక వేధింపులు, అశ్లీల వీడియో స్కామ్ వెలుగులోకి రావడంతో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించింది. ప్రస్తుతం కర్ణాటకలో ఇదే హాట్ టాపిక్.

  జేడీఎస్ హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణతో సంబంధం ఉన్న పలు వీడియోలు కర్ణాటకలో హల్ చల్ చేస్తున్నాయి. లైంగిక వేధింపులు, రేప్, అశ్లీల వీడియోల స్కామ్ లో ప్రజ్వల్ పూర్తిగా ఇరుక్కుపోయాడు. రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై దర్యాప్తునకు స్పెషల్ ఇన్విస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసింది. స్కామ్ వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ దేశం విడిచి జర్మనీ పరారయ్యాడు. ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి జేడీఎస్ నేత హెచ్ డి రేవణ్ణ పై హుబ్బిళి లోని హెళె నరసిపూర్ పోలీసు స్టేషన్ లో ఎఫ్ ఐఆర్ నమోదయింది. ఈ ఆరోపణలపై విచారణ కొనసాగుతుండగానే ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించి దర్యాప్తు కీలక మలుపు తిరిగింది. అశ్లీల వీడియోల తో కూడిన ఓ పెన్ డ్రైవ్ వెలుగులోకి రావడంతో మరింత రభస జరిగింది.

   జేడీఎస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి వెంటనే ప్రజ్వల్ ను జేడీఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబంతో తమకు సంబంధం లేదని, విభేదాల కారణంగా అన్న రేవణ్ణతో ఎప్పుడో తెగతెంపులు చేసుకున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. వారంతా ప్రస్తుతం హసన్ లో ఉంటున్నారని, ఎవరి వ్యాపారాలు వారివే నని కుమారస్వామి తెలిపారు. ప్రజ్వల్ ను సస్పెండ్ చేసేందుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామని హుబ్బిళిలో జరిగే కోర్ కమిటీ సమావేశం అతడిని సస్పెండ్ చేస్తుందని కుమార్ స్వామి తెలిపారు. సెక్స్ స్కామ్ విషయం తనకు కానీ, తనతండ్రి, జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు హెచ్ డీ దేవెగౌడ కు కానీ తెలియదని కుమారస్వామి వివరించారు. ఇది దేశ పౌరుడిగా సిగ్గుపడే విషయమని, రాష్ట్ర ప్రభుత్వం కచ్చితంగా దర్యాప్తు చేసి చర్య తీసుకోవాలన్నారు.

     అశ్లీల వీడియోలతో నిండిన పెన్ డ్రైవ్ బయటపడిందని, హసన్ జిల్లాలో అశ్లీల వీడియో క్లిప్ లు చక్కర్లు కొడుతున్నాయని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఎంపీ, ఎన్డీయే అభ్యర్థి ప్రజ్వల్ రేవణ్ణ వేలాది మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, వారి అభ్యంతరకరమైన వీడియోలను రికార్డ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. ప్రజ్వల్ బాగోతం 2023 డిసెంబర్ లోనే వెలుగులోకి వచ్చిందని కాంగ్రెస్ నాయకుడుపవన్ ఖేరా ఆరోపించారు. 2023 డిసెంబర్ 8న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి బీజేపీ నేత దేవరాజ్ గౌడ రాసిన లేఖలో ప్రజ్వల్ అశ్లీల వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్ ఉనికిని ప్రస్తావించారని పేర్కొన్నారు. అయినా బీజేపీ జేడీఎస్ తో ఎందుకు పొత్తు పెట్టుకుందని ప్రశ్నించారు. ఆ అంశంపై బీజేపీ నాయకత్వం , ప్రధాని ఎందుకు స్పందించలేదని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా ప్రశ్నించారు. ప్రజ్వల్ కు ఎవరు సహకరిం చారని నిలదీశారు. ఆ లేఖ ప్రతిని సోషల్ మీడియా ఎక్స్ లో పేర్కొన్నారు.

       జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన అశ్లీల వీడియోల కేసుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంలో ఎందుకు చర్యతీసుకోలేదని అమిత్ షా నిలదీశారు. ప్రజ్వల్ రేవణ్ణపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఉదాశీనత వ్యవహరించిందో చెప్పాలని అమిత్ షా నిలదీ శారు. అది పూర్తిగా రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతల సమస్య కాబట్టి తాము స్పందించ కూడద న్నారు. దీనిపై బీజేపీ భాగస్వామి పార్టీ అయిన జేడీఎస్ కూడా దర్యాప్తునకు డిమాండ్ చేసిం దన్నారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ, జేడీఎస్ కూటమిగా పోటీ చేస్తున్నాయి. బీజేపీ కర్ణాటకలో 3 స్థానాలను జేడీఎస్ కు కేటాయించింది. మాండ్య నుంచి కుమార స్వామి పోటీ చేస్తుండగా, హసన్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ రంగంలో ఉన్నారు. ఏప్రిల్ 26న ఈ స్థానానికి పోలింగ్ జరిగింది. దేవెగౌడ కుటుంబంలో మూడో తరం వాడు ప్రజ్వల్. దేవెగౌడ కొడుకు రేవణ్ణ కుమారుడు . గతంలో కర్ణాటక పిడబ్ల్యూడి మంత్రిగా పనిచేశాడు. బెంగళూరులో మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన ప్రజ్వల్ 2014 లో రాజకీయాల్లో చేరారు. పార్టీ జనరల్ సెక్రటరీగా పనిచేశారు. ప్రజ్వల్ ను జర్మనీ నుంచి స్వదేశం రప్పి స్తారా.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఏ చర్యలు తీసుకుంటుందో చూడాల్సిందే.

Latest Articles

ముంచుకొస్తున్న రెమాల్ తుఫాన్

రెమాల్ తుఫాను దూసుకొస్తోంది. బెంగాల్‌, అస్సోం, మేఘాలయలో రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు అధికారులు. తుఫాను కారణంలో కోల్‌కతా ఎయిర్‌పోర్టు మూసివేసి, విమాన రాకపోకలు నిలిపివేస్తు న్నారు. బంగాళాఖాతంలో రెమాల్‌ తుఫాన్‌ బలపడింది....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్