శ్రీలంక స్పిన్నర్ ప్రభాత్ జయసూర్య 71ఏళ్ల టెస్టు రికార్డును బద్దలుకొట్టాడు. సొంతగడ్డపై ఐర్లాండ్ జట్టుతో జరుగుతున్న రెండవ టెస్టులో పాల్ స్టీర్లింగ్ వికెట్ తీసిన జయసూర్య 50వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. దీంతో కేవలం 7టెస్టుల్లోనే 50వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా చరిత్ర సష్టించాడు. ఇందులో ఆరు సార్లు ఐదు వికెట్ల హాల్ నమోదుచేయడం విశేషం. గతంలో వెస్టిండీస్ స్పిన్నర్ ఆల్ఫ్ వాలంటైన్ 8టెస్టుల్లో 50వికెట్లు పడగొట్టగా.. తాజాగా ప్రభాత్ ఆ రికార్డును చెరిపేశాడు. కాగా ఆస్ట్రేలియా బౌలర్ చార్లీ టర్నర్ కేవలం 6టెస్టుల్లోనే 50 వికెట్లు పడగొట్టి మొదటి స్థానంలో ఉన్నాడు.