సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ఏపీ అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈవీఎంల ద్వారా పడిన ఓట్ల కంటే, ఉద్యోగ, ఉపాధ్యాయులు వేసిన పోస్టల్ ఓట్లు మరింత కాకరేపు తున్నాయి. ఏపీలోని అసెంబ్లీ స్థానాల్లో గెలుపోటములపై ఇవి ప్రభావం చూపే అవకాశం ఉండటంతో అందరి దృష్టి వీటిపైనే నెలకొంది. ఇటీవల కాలంలో ఏ ఎన్నికల్లో లేని విధంగా ఈసారి ఉద్యోగ, ఉపా ధ్యాయ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అత్యధికంగా పోలయ్యాయి. దీంతో అభ్యర్థుల్లో గుబులు రేగుతోంది. తమకు ఏమాత్రం వేశారోనన్న ఆందోళన వారిలో నెలకొంది. స్వల్ప తేడాతో ఓడిపోతే ఉద్యోగ, ఉపాధ్యా యులే కారణమవుతారన్న చర్చ జోరుగా జరుగుతోంది.


