అందాల హీరోయిన్ పూజా హెగ్డే చాలా సంతోషంగా ఉంది. అందుకు కారణం కూడా ఒకటి ఉంది. అదేదో హిందీ సినిమా ఆఫర్ వచ్చినందుకా? లేక కొత్త సినిమా సూపర్ హిట్ అయినందుకా? అంటే కాదండోయ్. అంతకుమించి తన కళ్లల్లో, ముఖంలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అందరితో చలాకీగా మాట్లాడుతోంది. రెట్టించిన ఉత్సాహంతో బిజిబిజీగా తిరిగేస్తుంది.
ఇంతకీ విషయం ఏమిటంటే తన సోదరుడు (రిషబ్ హెగ్డే) వివాహ మహోత్సవం అన్నమాట. అన్నయ్య పెళ్లి కావడంతో తనే దగ్గరుండి చేసింది. ఆ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి, ఒక్కసారి చాలా చిన్నపిల్లని అయిపోయాను..‘‘నవ్వాను- ఏడ్చాను’’ అని భావోద్వేగంగా పోస్ట్ చేసింది. దీంతో నెటిజన్లు, సినిమావాళ్లు, అభిమానులు అందరూ కొత్త జంటకు శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు.


శివాని శెట్టి అనే అమ్మాయిని పూజా సోదరుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇంతకీ రిషబ్ శెట్టి ఎవరని అంటే ముంబయిలో ఫేమస్ డాక్టర్ అన్నమాట. అక్టోబర్ 16, 2022న బెంగళూరులో శివానితో ఎంగేజ్ మెంట్ అయ్యింది.
జనవరి 27న వీరిద్దరి వివాహం జరిగింది. మెహందీ, సంగీత్ సెలబ్రేషన్స్ అంటూ మూడురోజులు రిషబ్-శివానీల పెళ్లి బంధువుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. సినిమా నటీనటులు, సెలబ్రిటీలు రావడంతో పెళ్లికి ఒక కళ వచ్చింది.
ఇప్పుడా వెడ్డింగ్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. పూజా హెగ్డే మాత్రం సంప్రదాయ చీరలో కట్టూబొట్టుతో నిజంగానే బుట్టబొమ్మలా కనిపించింది. ఇది చూసిన చాలామంది అభిమానులు ఊరికినే ఉంటారా? చేతిలో ఫోన్, ఫొటో కింద కామెంట్ బాక్స్ ఉంటే రెచ్చిపోరా…చాలా చక్కగా అందంగా కామెంట్లు పెడుతున్నారు.


‘‘పూజా సో క్యూట్’ అని ఒకరంటే ‘‘పూజా వెరీ క్యూట్ ట్రెడిషినల్’’ అని మరొకరు, ‘‘అబ్బా! పూజా ఎంత ఉందంగా ఉన్నావో…’’ అని మరొకరు,‘‘ నీ నవ్వు కోటి రత్నాలిచ్చినా కొనలేం’’,అని ఒకరంటే… నవ్వులు-పువ్వులు అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి… ‘మరి నీ పెళ్లెప్పుడు?’ అని అడుగుతున్నారు.
మొత్తానికి సోదరుడి పెళ్లి సందడిలో పూజా చాలా బిజీ అయిపోయింది. మరో వారం రోజుల్లో మళ్లీ రెగ్యులర్ షూటింగ్స్ కు రెడీ అవుతున్నట్టుగా అందరూ చెబుతున్నారు.