కర్ణాటకలో రాజకీయ దుమారం పీక్స్‌కి చేరింది. ముఖ్యమంత్రి మార్పు, మరో ముగ్గురు ఉప ముఖ్య మంత్రుల డిమాండ్ పై జోరుగా జరుగుతోంది. కాగా పార్టీ కార్యకర్తలు, నాయకులు ఈ అంశంపై బహి రంగ ప్రకటనలు జారీ చేయవద్దని రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డీకె శివకుమార్ కోరారు. లేదంటే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శివకుమార్ పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ‘నోరు అదుపులో పెట్టుకోవాలని’ పార్టీ సభ్యులకు తెలిపారు. రాజకీయ విషయాల్లో జోక్యం చేసుకోవద్దని సూచించారు. నిజానికి వీరశైవ-లింగాయత్, షెడ్యూల్డ్ కులాలు, తెగ, మైనారిటీ వర్గాలకు చెందిన నేతలకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని రాష్ట్రానికి చెందిన కొందరు మంత్రులు సమర్థిస్తున్నారు. ప్రస్తుతం వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే శివకుమార్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు.మరో ముగ్గురు ఉప ముఖ్యమంత్రులను నియమించాలని డిమాండ్ చేస్తూ మంత్రులు చేసిన ప్రకటనలు శివ కుమార్‌ను కంట్రోల్ చేయడం కోసమే అనే వాదన వినిపిస్తోంది. ప్రభుత్వం ఏర్పాటైన రెండున్నరేళ్ల తర్వాత శివకుమార్ ముఖ్యమంత్రి పదవిని డిమాండ్ చేసే అవకాశం ఉందనే మరో చర్చ సాగుతోంది.