తెలంగాణ ప్రజలను పోలీసులు హెచ్చరించారు. అపరిచితుల నుంచి వచ్చే ఫేక్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కొందరు కేటుగాళ్లు పోలీస్ డీపీతో కాల్ చేసి మోసం చేసే ప్రమాదం ఉందని చెప్పారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అపరిచితులు పోలీసులుగా తమను తాము పరిచయం చేసుకుని మోసాలకు పాల్పడుతుంటారని తెలిపారు. మీకు సంబంధించిన వారు, మీ బంధువులు గానీ స్నేహితులు గానీ పట్టుబడ్డారని.. డ్రగ్స్ కొరియర్స్ వచ్చాయని.. మభ్యపెడతారని అన్నారు. పెద్ద తప్పు చేశారని టెన్షన్ పెట్టి బురిడీ కొట్టిస్తారని హెచ్చరించారు. అలాంటి వాటికి స్పందించవద్దని సూచించారు. ఓ వ్యక్తికి సైబర్ నేరగాడు తాను పోలీస్ అంటూ చేసిన ఫోన్ కాల్ వీడియోను డీజీపీ పోస్ట్ చేశారు.