ఎమ్యెల్యే పిన్నెల్లి రామకృష్టా రెడ్డి పోలింగ్ వేళ ఈవీఎంలను ధ్వంసం చేసిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదుకాగా, పిన్నెల్లి పరారీలో ఉన్నారు. దీంతో రెండు రాష్ట్రాల్లో పిన్నెల్లి కోసం నాలుగు పోలీసు బృందాలు విసృతంగా గాలిస్తున్నా యి. ఇప్పటికే అధికారులు పిన్నెల్లిపై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇక, మరోవైపు చలో మాచర్ల నేపథ్యంలో మాచర్లలో హై టెన్షన్ నెలకొంది. ఈ నేపథ్యంలో అధికారులు మాచర్లలో144 సెక్షన్ అమలు చేశారు. అలానే మాచర్లకు వెళ్లే మార్గాల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. ప్రతి వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అలానే అనుమానితులను అదుపు లోకి తీసుకుంటున్నారు. మాచర్లలో ఎలాంటి రాజకీయ పర్యటనకు అనుమతి లేదని పోలీసులు తేల్చి చెప్పారు. అయినా సరే మాచర్లకు వెళ్తామంటూ టీడీపీ సీనియర్ నేతలు ప్రకటించారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగ కుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.