యూట్యూబర్ ప్రణీత్ హనుమంతును నాంపల్లి కోర్టులో హాజరుపర్చారు పోలీసులు. తండ్రి కూతురుపై వివాదాస్పద చర్చ కేసులో నిన్న బెంగళూరులో ప్రణీత్‌ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతుపై 4సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పీటీ వారెంట్‌పై సైబర్ క్రైం పోలీసులు హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. పోలీసులు హనుమంతును రహస్య ప్రాంతంలో విచారించి కోర్టులో హాజరుపర్చారు. ప్రణీత్‌తో పాటు లైవ్ చాటింగ్ చేసిన డల్లాస్ నాగేశ్వర్‌రావు, బుర్రా యువరాజ్, సాయిలపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం సైబర్‌క్రైమ్ పోలీసుల అదుపులో యూట్యూబర్ ప్రణీత్ ఉన్నాడు.


