ఎమ్మెల్యేలు అరెకపూడి, కౌశిక్ రెడ్డిల మధ్య జెండా జగడం రాజుకుంది. పార్టీ ఫిరాయింపులపై ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య వివాదం కొనసాగుతోంది. బీఆర్ఎస్ శాసనసభ్యుడినే అని గాంధీ వ్యాఖ్యలు చేయడంతో ఆయన నివాసంలోనే పార్టీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేస్తామని బీఆర్ఎస్ అంటోంది. ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ నివాసంలో శేరిలింగంపల్లి నియోజవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తామని అంటోంది.
చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపిచ్చింది. చలో గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పిలుపునిచ్చారు. మేడ్చల్ జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు, కార్పొరేటర్లు, పార్టీ ముఖ్య నాయకులు సమావేశానికి హాజరుకానున్నట్లు బీఆర్ఎస్ చెబుతోంది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా హాజరుకానున్నారు. మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు నివాసం నుంచి బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల బృందం ర్యాలీగా బయలుదేరాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. శంబిపూర్ రాజు ఇంటి వద్ద భారీగా పోలీసులను మోహరించారు.
శంభిపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. పీఏసీ చైర్మన్ పదవి వచ్చిన సందర్భంగా గాంధీ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపడంతో పాటు ఆయన నివాసంలో మేడ్చల్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు శంబిపూర్ రాజు ప్రకటించారు.