UttarPradesh: సెలవు కోసం ఓ పోలీస్ అధికారి ఉన్నతాధికారులకు రాసిన లీవ్ లెటర్(Leave Letter) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫరూఖాబాద్ పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ సెల్ ఇన్‌ఛార్జిగా పనిచేస్తున్న ఇన్స్పెక్టర్.. హోలీ(Holi) పండుగ సందర్భంగా సెలవు కోసం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ మీనాకు లేఖ రాశారు. తమకు పెళ్లి అయి 22 సంవత్సరాలు అవుతుందని.. అప్పటి నుంచి తన భార్యను హోలీ పండుగకు తన పుట్టింటికి తీసుకెళ్లకపోవడంతో తనపై కోపంగా ఉందని లేఖలో పేర్కొన్నాడు. ఆమెను శాంతింపజేయాలంటే 10రోజులు సెలవు కావాలని కోరాడు. సార్ ప్లీజ్ తన సమస్యను అర్థం చేసుకుని కచ్చితంగా సెలవులు ఇవ్వాలని అభ్యర్థించాడు. ఈ లేఖను చదివిన ఎస్పీ.. నవ్వుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఇన్స్పెక్టర్ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న ఎస్పీ.. 10రోజులకు బదులు 5రోజులు సెలవులు మంజూరు చేసినట్లు వెల్లడించారు.