స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: తెలంగాణ పోలీస్ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్ తెలిపింది పోలీస్ నియామక మండలి. రాష్ట్రంలో నిర్వహించిన పోలీస్ కానిస్టేబుల్ మెయిన్స్ ప్రిలిమినరీ ‘కీ’ని విడుదల చేసింది. కానిస్టేబుల్ సివిల్, పీసీ డ్రైవర్, మెకానిక్, ట్రాన్స్‌పోర్ట్, ఎక్సైజ్, ఐటీ తత్సమాన పోస్టులకు నిర్వహించిన చివరి పరీక్ష ప్రిలిమినరీ ‘కీ’ ని.. www.tslprb.in అనే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది. అభ్యంతరాలను 24 మే సాయంత్రం 5 గంటలలోపు తెలియజేయాలని అభ్యర్థులకు సూచించింది. ఇందుకోసం ప్రత్యేక ప్రొఫార్మా వెబ్‌సైట్‌లో ఉంచనున్నట్లు పేర్కొన్నారు. అభ్యంతరం ఉన్న ఒక్కో ప్రశ్నకు ప్రొఫార్మా ప్రకారం నమోదు చేయాలని పేర్కొంది. అలాగే అభ్యంతరానికి సంబంధించిన డాక్యుమెంట్‌ను అప్‌లోడ్ చేయాలని తెలిపింది. ఒకవేళ అభ్యర్థన అసంపూర్తిగా ఉంటే దాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేసింది.