భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆపరేషన్ చేయూత ఫలితమే మావోయిస్టుల లొంగుబాటుకు ప్రధాన కారణమని భద్రా చలం ఏఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు. తెలంగాణ పోలీసులు ఆపరేషన్ చేయూత పేరుతో మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో సీపీఐ మావోయిస్టు పార్టీ మిలీషియా కమిటీ సభ్యులుగా పని చేస్తున్న ఆరుగురు సభ్యులు ఏఎస్పీ ఎదుట లొంగి పోయారు. పోలీసులు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలకు ఆకర్షితులై లొంగిపోయామని సభ్యులు తెలిపారు. జనజీవన స్రవంతిలో గడపాలనుకునే మావోయిస్టులకు పోలీస్ యంత్రాంగం తరుపున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని ఏఎస్పీ పరతోష్ పంకజ్ తెలిపారు. లొంగిపోయిన సభ్యులకు జీవనో పాధి పునరావాసం కల్పించడం తమ బాధ్యతని ఆయన చెప్పారు.


