పోలాండ్ తెలుగు అసోసియేషన్(PoTA) ఆధ్వర్యంలో పోలాండ్ రాజధాని అయిన వార్సాలో ఎంతో ఘనంగా శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది, అసోసియేషన్ ప్రధమ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. పోలిన్ మ్యూజియం ప్రాణంగం తెలుగుదనంతో, పండుగ సందడి వాతావరణంతో కళకళలాడింది. పోలాండ్ నలుమూలల నుంచి ప్రవాస తెలుగు వారు ఈ వేడుకలకు తరలి వచ్చారు. భారత రాయబారి నగ్మా మల్లిక్, యురోపియన్ పార్లమెంట్ మెంబర్స్, విదేశీ వ్యవహారాల మంత్రులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
PoTA తెలుగు వేడుకలు పోలాండ్లో తెలుగు సంస్కృతిని, భాషను ప్రోత్సహించడంలో ఒక మైలురాయిగా నిలిచిపోయాయి. సాంస్కృతిక శాఖను నిర్వహిస్తున్న స్వాతి అక్కల, నిహారిక గుంద్రెడ్డి , భవాని కందుల ఆధ్వర్యంలో నిర్వహించిన చిన్న పిల్లల తెలుగు నాటకం, ఏకపాత్రాభినయం (పోతన, అల్లూరి సీతారామరాజు, తెనాలి రామకృష్ణ, రుద్రమదేవి, యమలోక యమ) అందరిని అలరించాయి.అధ్యక్షుడు చంద్ర భాను ఆహుతులను ఉద్దేశించి మాట్లాడుతూ ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న తెలుగు కళలను నేర్చుకుంటున్న పిల్లలను ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులకు కృతజ్ఞతాభివందనాలు తెలియజేశారు. వ్యాఖ్యాతలుగా వ్యవహరించిన విశ్వశాంతి గదేపల్లి, అనురాధ శ్రీనాధుని గార్లు వారి వాక్చాతుర్యంతో కార్యక్రమాన్ని నడిపించారు.
ఈ కార్యక్రమంలో తెలుగు ప్లేబాక్ సింగర్స్ పృథ్వి చంద్ర, సాకేత్ కొమండూరి, మనీషా ఈరాబత్తుని లైవ్ మ్యూజికల్ కన్సర్ట్ను నిర్వహించి అక్కడి తెలుగు వారిని ఉర్రూతలూగించారు. ఈ వేడుకల్లో PoTA సభ్యులు శశి కాట్రగడ్డ, శ్రీదేవి, రాజ్యలక్ష్మి ధూమంత రావు, ఆషా పెరుమాళ్ల, సందీప్ శ్రీనాధుని , సురేశ్ పెరుమాళ్ల, బాపిరాజు ధూమంత రావు, శైలేంద్ర గంగుల, ప్రవీణ్ వెలువోలు, రామ సతీష్ రెడ్డి, సుబ్బిరామ రెడ్డి గుంద్రెడ్డి, కిరణ్మయి, సహృతి, భవాని, విద్యార్థులు కీలక పాత్ర పోషించారాని వ్వవస్థాపకులు చందు కాట్రగడ్డ, చంద్ర అక్కల అభినందించారు.


