Prahlad Modi | ప్రధాని నరేంద్ర మోదీ సోదరుడు ప్రహ్లాద్ మోదీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆల్ ఇండియా ఫెయిర్ ప్రైస్ షాప్ డీలర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ గా విధులు నిర్వర్తిస్తున్న ప్రహ్లాద్ కొన్ని రోజులుగా కిడ్నిసంబంధ సమస్యలతో బాధపడుతున్నాడు. అయితే ఆయన ఒక్కసారిగా అనారోగ్యానికి గురవ్వడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలిచారు. కొంతకాలం ప్రహ్లాద్ మోదీ(Prahlad Modi) భారతదేశం మొత్తం ఆధ్యాత్మిక పర్యటన చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబం కన్యాకుమారి, రామేశ్వరం, మధురై ఆలయాలను సందర్శిస్తున్నారని తెలుస్తోంది. కాగా గతేడాది కూడా ప్రహ్లాద్ మోదీ, ఆయన కుటుంబసభ్యులు ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురైంది.