కువైట్ అగ్ని ప్రమాదంతో గల్ప్ దేశాలలో భారతీయ కార్మికుల నిస్సహాయ పరిస్థితి వెలుగులోకి వచ్చింది. కువైట్ ఒక్కటే కాదు. అనేక గల్ప్ దేశాలలో భారతీయులు అత్యంత దయనీయ పరిస్థితుల్లో బతుకు బండి నడుపుకుంటు న్నారు.
భారతీయుల్లో ప్రధానంగా కేరళ, తెలంగాణ నుంచి వెళ్లిన కార్మికులున్నారు. ఉపాధి దొరికే వరకు ఎక్కడో ఓ చోట తలదాచుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఒక చిన్న గదిలో దాదాపు ఇరవై మంది వరకు భారతీయ కార్మికులుంటారు. సరిగ్గా నిద్ర పోవడానికి కూడా వసతి ఉండదు సదరు గదుల్లో. వాష్ రూం కు వెళ్లాలన్నా గంటలకొద్దీ వేచి చూడాల్సిన దారుణ పరిస్థితులు ఉంటాయి. ఒక్కో గదిలో ఇరవై మంది వరకు ఉండటంతో అగ్ని ప్రమాదం జరిగిన వెంటనే ప్రాణాలు కాపాడుకోవాలన్న ఆత్రుతతో అందరూ బయటకు వెళ్లడానికి ప్రయత్నిస్తారు. దీంతో తీవ్రమైన తొక్కిసలాట జరుగుతుంది. ఒక్కోసారి ఈ తొక్కిసలాట ఫలితంగానూ భారతీయ కార్మికులు ప్రాణాలు కోల్పోతుంటారు. అగ్ని ప్రమాదా లు జరగడానికి అనేకానేక కారణాలుంటాయి. ఒక్కోసారి చిన్నపాటి నిర్లక్ష్యంతో భారీ మూల్యం చెల్లించుకో వాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో ఆస్తితో పాటు ప్రాణ నష్టం వాటిల్లే ప్రమాదం లేకపోలేదు. ఎక్కువగా షాట్ సర్క్యూట్ ల వల్ల అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి.
సహజంగా ఎత్తు అయిన భవంతుల్లోని గదుల్లో భారతీయ కార్మికులుంటారు. దీంతో భవనంలో ఒక్కసారిగా అగ్నిప్ర మాదం జరిగితే బయటకు వచ్చే పరిస్థితి కూడా ఉండదు. ఒక్కసారిగా గది నిండా దట్టమైన పొగలు అలుముకుంటా యి. ఒకవైపు ఎగసిపడే మంటలు మరో వైపు దట్టంగా అలుముకునే పొగలు. దీంతో పొగలతో చాలా మందికి ఊపిరి కూడా ఆడదు. ఈ పరిస్థితుల్లో ఊపిరి ఆడక చాలామంది చనిపోతుంటారు. సహజంగా అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా మంది వారున్న బిల్డింగ్ పై నుంచి దూకి ప్రాణాలు రక్షించుకుంటారు. అయితే భారతీయ కార్మికులు ఉండే గదులు అయిదో అంతస్తులోనో లేదా ఆరో అంతస్తులోనో ఉంటే కిందకు దూకడం కూడా చాలా సాహసంతో కూడుకున్న పనే. దీంతో కిందకు దూకడమా , వద్దా అనే సంశయాత్మక ధోరణిలో ఉన్నప్పుడే పొగలు చుట్టుముట్టి కార్మికులు ప్రాణాలు కోల్పోతుంటారు.
కువైట్‌లోనూ భవన యజమానులు నిబంధనలు పక్కన పెట్టిన సందర్బాలు అనేకం ఉన్నాయి. అలాగే కొన్ని బిల్డింగుల్లో అనుమతి లేకుండా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు పెడుతుంటారు. అధికారుల కళ్లు గప్పి ఇలాంటి తప్పుడు పనులకు పాల్పడుతుంటారు భవన యజమానులు. అలాగే మరికొన్ని భవంతు ల్లో పేలుడు పదార్థాలు, రసాయనాలు దాచి ఉంచుతారు. సహజంగా ఎవరూ పట్టించుకోని ప్రాంతాల్లో అపార్ట్ మెంట్‌లలో ఇలాంటివి జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడే ఆయా అపార్ట్ మెంట్‌లలో నిబంధనలకు పాతర వేశారన్న విషయం బయటపడుతుంది.
గల్ఫ్ దేశాల్లోనూ భవనాల నిర్మాణాల్లో అనేక అక్రమాలు చోటుచేసుకుంటున్నాయన్న సంగతి ఇటీవల బయటపడుతు న్నాయి. అగ్ని ప్రమాదాలకు చెక్ పెట్టే భద్రతాపరమైన జాగ్రత్తలను కువైట్ బిల్డర్లు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన నగరాలకు దూరంగా శివార్లలో ఉండే అపార్ట్‌మెంట్లలో అగ్ని ప్రమాదాలు జరిగితే దారుణ పరిస్థితులు ఉంటున్నాయి. కొన్ని సందర్బాల్లో అగ్ని ప్రమాదం జరిగితే కనీసం అగ్నిమాపక శకటం వెళ్లడానికి కూడా దారి వదలడం లేదు. విదేశాల్లో ప్రధానం గా గల్ఫ్ దేశాల్లో భారతీయ కార్మికులకు సరైన పని పరిస్థితులు లేవన్న విషయం జగమెరిగిన సత్యం. అయితే ఈ విషయమై ఇప్పటివరకు భారత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకో లేదు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు ఖండన ప్రకటనలు ఇవ్వడానికే భారత ప్రభుత్వం పరిమితమైంది. అయితే దీనికి ఫుల్ స్టాప్ వెయ్యాలని కాంగ్రెస్ పార్టీ కోరుతోంది. విదేశాలలో ఉన్న భారతీయులకు సరైన పని పరిస్థితులు కల్పించడానికి నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కోరారు. ఇందుకు అనుగుణంగా సమగ్ర బిల్లు రూపొందించాలని శశిథరూర్ డిమాండ్ చేశారు.
ఉన్న ఊరిలో చేయడానికి పని దొరక్క, కాస్తో కూస్తో ఉన్న ఆస్తులను అమ్ముకుని, ఆపై అప్పులు చేసి గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయ కార్మికులు అక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తొలిరోజుల్లో గల్ఫ్ దేశాల కు వెళ్లిన భారతీయ కార్మికులు అంతో ఇంతో సంపాదించుకున్నారు. అయితే ఆ తరువాత విజిట్ వీసాల పై వెళ్లిన వారు ఆయా దేశాల్లో తీవ్ర ఇబ్బందుల పాలయ్యారు. అనేక కష్టాలకు గురయ్యారు. గల్ఫ్ బాధితులకు ఉపాధి కల్పించడానికి చర్యలు తీసుకుం టామని ప్రభుత్వాలు ఎన్నిసార్లు ప్రకటించినా, ఆచరణలో వచ్చేసరికి తుస్సుమంటోంది. గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన భారతీయ కార్మికులకు ఇక్కడి పాలకులు ఎటువంటి దారి చూపించలేకపోతున్నారు.