కాకినాడ జిల్లా పిఠాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపాలిటీలో నిబంధనలకు విరుద్ధంగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇవ్వడంతో ఎలా నియమించారంటూ కౌన్సిలర్లు నిరసన చేశారు. వైసీపీ హాయాంలో అవినీతి పనులపై టీడీపీ కౌన్సిలర్లు విచారణకు డిమాండ్ చేశారు. ఛైర్మన్, మున్సిపల్ అధికారుల తీరు నిరసిస్తూ వాకౌట్ చేశారు. వైసీపీలోని ఒక వర్గం కౌన్సిలర్లు టీడీపీకి జత కలిసింది. 30మంది కౌన్సిలర్లలో 24మంది వాకౌట్ చేశారు. కోరం లేక చైర్‌పర్సన్ గండేపల్లి సూర్య వతి సభను వాయిదా వేశారు.