ఏపీలో కౌంటింగ్ దగ్గరపడుతున్న సమయంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో పెట్రో బాంబుల కలకలం రేగింది. రాజుపాలెం మండలం బ్రాహ్మణ పల్లిలో పెట్రో బాంబులు తయారు చేసే ముడి సరుకు లభ్య మైంది. గడ్డి వాములో నిల్వచేసిన పెట్రోల్ , 8 బీరు సీసాలు , 9 మద్యం బాటిల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు.ఏపీలో ఎన్నికల పోలింగ్ రోజు, ఆ తర్వాత జరిగిన హింసాకాండతో కేంద్ర ఎన్నికల సంఘం భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో సీఈసీ ఆదేశాల మేరకు నిఘా పెంచింది పోలీసు శాఖ. ఎల్లుండి కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. గత కొద్ది రోజులుగా పల్నాడు జిల్లాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎస్పీ మల్లికా గార్గ్ బృందం పర్యటిస్తోంది. ఈ నేపథ్యంలో సత్తెనపల్లిలో పెట్రో బాంబు ముడి సరుకు దొరకడం కలకలం రేపుతోంది.


