స్వాతంత్ర, వెబ్ డెస్క్: పల్నాడు జిల్లా వినుకొండ పట్టణానికి చెందిన పగడాల కోటేశ్వరరావు నరసరావుపేట రోడ్ లో రిలయన్స్ పెట్రోల్ బంక్ ముందు వాటర్ ప్లాంట్ నిర్వహిస్తూ ఉంటాడు. కోటేశ్వరావు బ్యాంకులో డబ్బులు విత్ డ్రా చేసుకొని పల్నాడు రోడ్ లోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ముందు జ్యూస్ తాగేందుకు బండిని పార్క్ చేయగా… బ్యాంకు నుండి కోటేశ్వరావును ఫాలో అవుతున్న గుర్తుతెలియని వ్యక్తులు బైక్ ట్యాంక్ కవర్ లో ఉన్నటువంటి 4 లక్షల 80 వేల రూపాయలను దొంగిలించారు. సీసీ కెమెరాలో రికార్డయిన దృశ్యాలతో పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు.. సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు.