గ్రామ సభల్లో ప్రజల భాగస్వామ్యం పెంచాలన్నారు మంత్రి సీతక్క. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పనులపై డీఆర్‌డీవోలతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నిర్దేశించుకున్న పనులు గడువులోగా చేపట్టాలని ఆదేశించారు. ప్రధానంగా మహిళలకు ఉపాధి భరోసా, పంట పొలాలకు బాటలు, పండ్ల తోటల పెంపకం, ఇంకుడు గుంతలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం ఉపాధి నిధులు వెచ్చించాలని సూచించారు మంత్రి సీతక్క.