28.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

దేశభక్తి, దైవభక్తితో ప్రకృతిలో ప్రజలు మమేకం కావాలి- పవన్‌ కల్యాణ్

ప్రకృతిలో దేవుణ్ణి చూసుకోవడం, పచ్చదనంలో భగవంతుడిని ఆరాధించడం భారతీయ సంప్రదాయం అని..ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వినాయక చవితి, స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా పర్యావరణహిత కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ ప్రతినిధులు పవన్ కళ్యాణ్‌ను కలిశారు.

అనంతరం వారు పవన్‌కు ప్రత్యేకంగా విత్తనాలతో రూపొందించిన మట్టి గణపతి, జాతీయ జెండాలను అందచేశారు. దైవభక్తి, దేశభక్తిని మిళితం చేస్తూ పర్యావరణహితంగా ప్లాన్ ఏ ప్లాంట్ సంస్థ చేసిన ఆలోచన చాలా బాగుందని కొనియాడారు. ఈ ఆలోచన సమాజహితంగా ఉందని చెప్పారు. పర్యావరణానికి ఉపయోగపడే ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్లాస్టిక్ జెండాలు వాడవద్దని సూచించారు. పర్యావరణహితమైన జెండాలు మాత్రమే వినియోగించాలని డిప్యూటీ సీఎం చెప్పారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్