ఎన్నికల ముందు ఇష్టానుసారం హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ప్రజల్ని మోసం చేశారని అన్నారు పెద్దపల్లి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్. ఒకే కుటుంబం నుంచి ముగ్గురికి టికెట్లు ఇవ్వడమేనా సామాజిక న్యాయమని ప్రశ్నించారు. ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేయాలని చెప్పారు. వందల కోట్ల ఆస్తులు ఉన్న వ్యాపారవేత్తలకు ఓటు వేస్తే అంతిమంగా నష్టపోయేది ప్రజలేనన్నారు. మహిళలకు 2వేల500 రూపాయలు ఇస్తామని చెప్పి ఇప్పుడు మాట మార్చడం మోసం చేయడం కాదా అని కొప్పుల ఈశ్వర్ ప్రశ్నించారు.