ఖమ్మం జిల్లా సత్తుపల్లి రవాణాశాఖ కార్యాలయంలో ఉద్యోగులు పెన్‌డౌన్ చేపట్టారు. దీంతో కార్యాలయం లో పనులు నిలిచిపోయాయి. హైదరాబాద్ జేటీసీ కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్‌పై దాడికి నిరసనగా వారు పెన్‌డౌన్ చేశారు. జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ రమేష్‌పై ఆటో యూనియన్ నాయకుడు చేసిన దాడికి నిరసనగా పెన్ డౌన్ చేసినట్లు మోటార్ వెహికల్ ఇనస్పెక్టర్ యోగీశ్వర్ జాదవ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా రవాణాశాఖ కార్యాలయాలలో అధికారులు, సిబ్బంది పెన్‌డౌన్ చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ అధికారులపై దాడి చేయటం అమానుషమన్నారు. ఇలాంటి చర్యలను తాము ఖండిస్తూ పెన్‌డౌన్ చేస్తున్నట్లు యోగీశ్వర్ జాదవ్ చెప్పారు.


