23.2 C
Hyderabad
Monday, January 26, 2026
spot_img

పెండింగ్ లో ఉన్న సీఎంఆర్ఎఫ్ స్కీం ఆర్థికసాయం

    ఆసుపత్రుల్లో వైద్య సాయం పొందుతున్న రోగులు సీఎం రిలీఫ్ ఫండ్ సాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. సీఎంఆర్ఎఫ్ చెక్కుల జారీ పై రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అప్పట్లో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వల్ల ఈ సాయానికి బ్రేక్ వచ్చింది. అయితే, ఇప్పుడు ఆ సమస్య తీరడంతో..రోగులు సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురు చూస్తున్నారు.

 బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇంకా చెక్ లు ఇవ్వలేదు. ప్రభుత్వ నిర్ణయం పై రోగగ్రస్థులు ఎదురు చూస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మంది రోగులకు సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మొత్తం రావాల్సి ఉంది. సీఎంఆర్ఎఫ్ పథకం ద్వారా రోగులకు అందించాల్సిన ఆర్థికసాయంపై కాంగ్రెస్ ప్రభుత్వం విధానపర నిర్ణయమేది ఇప్పటి వరకు తీసుకోలేదు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 80 వేల మందికి ఆర్థిక సాయం నిలిచిపోయింది. ఈ మొత్తం 350 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గత ప్రభుత్వం సిద్దంగా ఉంచిన 35 వేలు అంటే సుమారు 150 కోట్ల రూపాయల విలువైన చెక్కులు డిస్పాచ్ కు నోచుకోకుండా పోయాయి.

     గత ఏడాది డిసెంబర్ 5 న ఎన్నికల నియమావళికి తెరపడడం, కాంగ్రెస్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవ్వడం, మంత్రివర్గం కొలువుదీరడం తదితర పరిణామాలు వరుసగా జరిగాయి. అయితే, పెండింగులో ఉన్న చెక్కుల పంపిణీ ప్రక్రియ మాత్రం మొదలు కాలేదు. చెక్కులు సిద్దంగా ఉన్నా, దాదాపు 80 వేల దరఖాస్తులుపెండింగులో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయినా, కొత్త ప్రభుత్వం మాత్రం సీఎంఆర్ఎఫ్ పథకంపై ఇంకా దృష్టి సారించలేదు. పాత దరఖాస్తుల్లో అధికశాతం అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల సిఫారసులే కావడంతో నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోందన్న చర్చ జరుగుతోంది. సీఎంఆర్ఎఫ్ కు శ్రీకారం చుడితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలే కాకుండా, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేల చేతుల మీదుగానూ లబ్ధిదారులకు అందజేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష బీఆర్ఎస్ కు ఎక్కువ సంఖ్యలోనే ఎమ్మెల్యేలు ఉన్నారు. అధికారం చేజిక్కించుకోలే కపోయినా, ఎమ్మెల్యేల సంఖ్య మాత్రం ఎక్కువగానే ఉంది. అలా చేస్తే ఆ క్రెడిట్ బీఆర్ఎస్ ఎమ్మేల్యేలకు వెళ్లవచ్చనే భావన రాష్ట్ర సర్కారుకు ఉండి ఉండవచ్చనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట్ల ప్రస్తుతం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అలాంటి నియోజకవర్గాల చెక్కుల పంపిణీ చేపడితే, ఆ పేరు అప్పటి ఎమ్మెల్యేలకే వస్తుందనేది ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గత ప్రభుత్వం లో ఇచ్చిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ ల పై ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుందో అని ఎదురుచూస్తున్నారు. మరి ప్రభుత్వం ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి..

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్