స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తు, ముఖ్యమంత్రి సీటు వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ఎనిమిది పేజీల లేఖను విడుదల చేస్తూ పవన్ బాగోతాన్ని వివరించారు. లేఖలో పవన్ గురించి పేర్కొన్న మంత్రి అంబటి.. ‘పవన్ కల్యాణ్ రాజకీయం అంతా బాబు చేత… బాబు వల్ల… బాబు కోసం అన్న నిజాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి. ప్రతిపక్షాలన్నింటితో పొత్తు అన్నది కేవలం పవన్ రాజకీయ ఎత్తు మాత్రమే! అంటూ రాసుకొచ్చారు. బాబుతో మరోసారి రాజకీయ వివాహ బంధానికి వేదిక రెడీ చేయటానికే రైతుల పేరిట పవన్ రెండు రోజుల పర్యటనచేస్తున్నారు అంటూ మండిపడ్డారు.


