స్వతంత్ర వెబ్ డెస్క్: సినిమాల్లో రాజకీయాలను మిక్స్ చేయడం అనేది మామూలు విషయం కాదు.. కానీ సినిమాల్లో పొలిటికల్ డైలాగులు వాడుకోవడం కామన్ ట్రెండ్ గా మారింది. ఇదే క్రమంలో పవర్ స్టార్, జనసేనాని పవన్ కళ్యాణ్ సినిమాలోని ఒక సన్నివేశం ఇప్పుడు రాజకీయంగా రచ్చ చేస్తోంది. ఈ సీన్ కు సంబంధించి స్పందిస్తూ మంత్రి అంబటి రాంబాబు.. ‘గెలిచినోడి డాన్స్ సంక్రాంతి.. ఓడినోడి డాన్స్ కాళ రాత్రి’ అంటూ ట్వీట్ చేసి పవన్ కు చురకలంటించారు.
వివరాల్లోకెళ్తే.. సినిమాల్లో పొలిటికల్ డైలాగులు వాడుకోవడం కామన్ ట్రెండ్ గా మారింది. అందులో నందమూరి బాలకృష్ణ ముందుంటారనే చెప్పాలి. అయితే, ఇప్పుడు పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కూడా ఇదే కోవలో చేరిపోయారు. ఇటీవల విడుదలైన బ్రో సినిమాలో కొన్ని పొలిటికల్ డైలాగులు ఉన్నాయి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి ‘మాటల మాంత్రికుడు’ అనే ట్యాగ్ ను నిలబెట్టుకున్నారు. సినిమా ప్రారంభ సన్నివేశాల్లో మార్కండేయులు (సాయిధరమ్ తేజ్) టైమ్ (పవన్ కళ్యాణ్)ను ‘టీ’ తినమని అడిగే సందర్భం సహా మరికొన్ని సన్నివేశాల్లో అధికార పార్టీ నేతలను టార్గెట్ చేసినట్టుగా డైలాగ్స్ ఉన్నాయి.