ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసైనికులకు ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ బహిరంగ సందేశం ఇచ్చారు. పొత్తుల గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను నమ్మవద్దని.. ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకుంటే తానే అధికారికంగా చెబుతానని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు మేలు కలిగే విధంగా పొత్తులపై నిర్ణయం తీసుకుంటానని.. అప్పటివరకు ఎలాంటి వదంతులను నమ్మకండని పేర్కొన్నారు. అలాగే ఆయా పార్టీలకు చెందిన చిన్న చిన్న నేతలు జనసేనను విమర్శిస్తే అది వారి వ్యక్తిగత విమర్శగా తీసుకోవాలని.. వారి విమర్శలను ఆ పార్టీల అధినేతలకు ఆపాదించొద్దని కోరారు. తీవ్రమైన ఆర్థిక నేరాల గురించి మీడియాతో మాట్లాడేటప్పుడు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీని సంప్రదించాలని సూచించారు. ఈ మేరకు ఓ బహిరంగ లేఖను ట్వటర్ లో విడుదల చేశారు.
ప్రియమైన జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులకు… – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/QbaAExy3OW
— JanaSena Party (@JanaSenaParty) April 24, 2023