స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి. కుక్క తోకను ఆడించగలదు.. కానీ, తోక కుక్కను ఆడించ లేదు అంటూ సెటైరికల్ కామెంట్స్ చేశారు. పవన్ కల్యాణ్ ఇమేజ్ ఒక నీటి బుడగ.. పవన్ కు ఇమేజ్ ఉన్నట్లు చంద్రబాబు సృష్టిస్తున్నాడని వ్యాఖ్యానించారు. చంద్రబాబు పల్లకి మోయటమే తన ఎజెండా అని పవన్ స్పష్టత ఇచ్చారని అన్నారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ 2019లో ప్రయత్నించాడని అన్నారు. ముఖ్యమంత్రి కావాలన్న చంద్రబాబు కలనే పవన్ కల్యాణ్ కంటున్నాడని అన్నారు. తనకు బలం లేదని పవన్ అంగీకరించారని.. తనను సీఎంని చేయాలనే అభిమానులను చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని మండిపడ్డారు.


