స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో పుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, OG షూటింగ్స్ లతో బిజీబిజీగా గడుపుతున్నాడు. ఆయా సినిమాల నుంచి రోజుకో అప్టేడ్ ఇస్తూ అభిమానులకు కిక్ ఇస్తున్నాడు. తాజాగా మెగా మేనల్లుడు సాయితేజ్ తో కలిసి నటించిన సినిమా నుంచి బిగ్ అప్టేడ్ విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ ఫస్ట్ లుక్‌తో పాటు BRO అనే టైటిల్ ఖరారుచేస్తూ మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. శివుడి శ్లోకంతో వచ్చే బీజీఎంతో పవర్ స్టార్ స్వాగ్ లుక్ అదిరిపోయింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. కాగా ఈ సినిమా జులై 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.