స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేనాని పవన్‌కల్యాణ్‌పై మరోసారి మంత్రి ఆర్కే రోజా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబునాయుడు, లోకేశ్, పవన్‌కల్యాణ్‌లపై రోజా ఒంటికాలిపై లేచే సంగతి తెలిసిందే. తిరుమలలో ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ విమర్శలు సంధించారు. పవన్‌కల్యాణ్ షూటింగ్ గ్యాప్‌ల్లో చంద్రబాబు ఇచ్చే ప్యాకేజీ తీసుకుని ఊగిపోతూ, టీడీపీ స్క్రిప్ట్ చదువుతూ తమపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రూ.118 కోట్ల ముడుపులకు సంబంధించి ఐటీశాఖ నోటీసులు ఇచ్చిందని, వాటిపై చంద్రబాబు, లోకేశ్, పవన్‌కల్యాణ్ ఎందుకు స్పందించలేదని రోజా ప్రశ్నించారు. అమరావతిలో అక్రమాలకు పాల్పడిన దోచుకున్న డబ్బును బ్రాహ్మణి, భువనేశ్వరి లెక్కల్లో పెట్టారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేశ్‌లపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే చంద్రబాబు, లోకేశ్‌లను విచారించి అరెస్ట్ చేయాలని రోజా కోరారు.
పాదయాత్ర చేస్తున్న నారా లోకేశ్ ప్రతి నియోజకవర్గంలో ఊరికే మొరుగుతున్నాడని విమర్శించారు. ఇదిలా వుండగా తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై తానేమీ విమర్శలు చేయలేదని వివరణ ఇచ్చారు. ఎన్టీఆర్ జయంతి నాడు చంద్రబాబుపై తెలియక ప్రశంసలు కురిపించారని మాత్రమే అన్నట్టు రోజా తెలిపారు. ఎన్టీఆర్ గురించి మాత్రమే మాట్లాడి వుంటే బాగుండేదని సూచించామన్నారు. బాబుకు ఓటు వేసి గెలిపించాలనే రజినీకాంత్ విన్నపాన్ని ఖండించినట్టు ఆమె చెప్పారు. చంద్రబాబు లాంటి వ్యక్తి గురించి మాట్లాడితే రజినీకాంత్ ఇమేజ్ తగ్గుతుందన్నారు. తమిళనాడులో ఎవరినో ఉద్దేశించి రజనీకాంత్ మాట్లాడితే దానిపై జనసైనికులు, టీడీపీ వాళ్లు కలిసి ట్రోల్స్ చేశారని రోజా అన్నారు. ఏపీలో చంద్రబాబుకి ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, ఇల్లు లేవని రోజా వెటకరించారు.