27.7 C
Hyderabad
Sunday, June 29, 2025
spot_img

Vasireddy Padma: పవన్ కల్యాణ్ దత్తపుత్రుడే కాదు విషపుత్రుడు కూడా..!

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని​ వాలంటీర్ వ్యవస్థపై జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై​ రేగిన దుమారం ఇంకా తగ్గడం లేదు. ఆయన కామెంట్స్ పై సీరియస్ అయిన వాలంటీర్లు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేశారు. నిరసనలే కాదు.. ఈ విషయంలో పవన్​పై వాలంటీర్లు కేసు పెట్టేదాకా వెళ్లింది. అయితే వాలంటీర్లపై పవన్ చేసిన వ్యాఖ్యల్ని ఇప్పటికే పలుమార్లు తప్పుబట్టారు ఏపీ మహిళా కమిషన్ ఛైర్​పర్సన్ వాసిరెడ్డి పద్మ. తాజాగా మరోసారి జనసేన అధినేతపై ఆమె మండిపడ్డారు. మహిళల సమక్షంలో పవన్ రచ్చబండకు రావాలని ఆమె ఛాలెంజ్ చేశారు. పవన్ కల్యాణ్​ కేవలం దత్తపుత్రుడే కాదని విషపుత్రుడంటూ వాసిరెడ్డి పద్మ ఘాటుగా విమర్శలు చేశారు.

మహిళల అదృశ్యం విషయంపై రాజ్యసభలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ఒక ప్రకటన చేశారని వాసిరెడ్డి పద్మ గుర్తుచేశారు. ఆ ప్రకటన ప్రకారం.. మహిళల అదృశ్యంలో  దేశంలో ఏపీ 11వ స్థానంలో ఉందన్నారామె. అయితే పవన్ కల్యాణ్​ మాత్రం ఈ విషయాన్ని ప్రస్తావించడం లేదని ఆమె సీరియస్ అయ్యారు. రాజ్యసభ ఎందుకు ఏపీలో మహిళల అదృశ్యం పైనే ఎక్కువ ఆందోళన చెందుతోందని వాసిరెడ్డి పద్మ ప్రశ్నించారు. పవన్ కూడా ఒక్క ఏపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ప్రేమ వ్యవహారాల వల్లే చాలా మంది అమ్మాయిలు అదృశ్యం అవుతున్నారని ఆమె చెప్పుకొచ్చారు.

ప్రేమ వ్యవహారాల వల్లే అమ్మాయిలు మిస్సవుతున్నారని చెప్పిన వాసిరెడ్డి పద్మ.. ఈ ప్రేమలకు సినిమాలు ఒక కారణం కాదా? అని ప్రశ్నించారు. తప్పిపోయిన వారిలో 78 శాతం అమ్మాయిలు వెనక్కి వస్తున్నారనే విషయాన్ని ఎందుకు గుర్తించడం లేదని  ప్రశ్నించారు.  చీరలు పంచుతామని పిలిచి చావులకు కారణమయ్యారని పరోక్షంగా టీడీపీపై ఆమె ఫైర్ అయ్యారు. మహిళలకు మీరు, మీ పార్ట్​నర్ ఇచ్చే గౌవరం ఇదంటూ చంద్రబాబు, పవన్​పై వాసిరెడ్డి పద్మ విమర్శలు గుప్పించారు. పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రం అమ్మాయిల మిస్సింగ్ కేసుల్లో ఆరో స్థానంలో ఉంటే జనసేనాని ఎందుకు నోరు విప్పడం లేదని ఆమె నిలదీశారు. మహిళా కమిషన్​కు రాజకీయ దురుద్దేశాన్ని ఆపాదిస్తున్నారని.. ఇది సరికాదని వాసిరెడ్డి పద్మ సీరియస్ అయ్యారు.

 

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్