స్వతంత్ర వెబ్ డెస్క్: పవన్ కళ్యాణ్ పొలిటికల్ టూరిస్ట్ అని ఏపీ మంత్రి అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. ఏపీలో లోకల్, నాన్ లోకల్స్ మధ్య పోటీ జరుగుతుంది. పవన్, చంద్రబాబు వాళ్లను సమర్థించే వారందరూ ఏపీలో నాన్ లోకల్స్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు ఆంధ్రా.. నివాసాలకు తెలంగాణ కావాలా..? అని ప్రశ్నించారు మంత్రి అమర్నాథ్ రెడ్డి. పవన్ కళ్యాణ్ పై సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రజలు సమర్థిస్తున్నారని పేర్కొన్నారు అమర్నాథ్.
సైకిల్ తొక్కుకునే రాధా అవినీతి అనకొండగా ఏరకంగా తయారయ్యాడో అనేక ఉదాహరణలున్నాయి. ఈ ప్రాంతం మీద అభిమానం లేని నాయకులు.. ఉత్తరాంధ్ర ప్రాంతంపై దుష్ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉండే సంపదను దోచుకోవడం.. దోచుకున్న సంపదను పంచుకునేందుకు హైదరాబాద్ వేదికగా చేసుకున్నారు. అవసరం కోసం రకరకాల రాజకీయ విన్యాసాలు చేస్తున్నారని ఆరోపించారు. సీఎం జగన్ పై వాళ్లు చేస్తున్న దుష్ప్రచారాన్ని నమ్మకూడదని కోరారు. ఎన్నికల్లో సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చామని.. కరోనా వంటి ఇబ్బందులు ఎదుర్కొని.. పేదోడికి ఇబ్బందులు కలుగకుండా ప్రజలందరికీ మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తుందని తెలిపారు.