జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మంత్రి అంబటి రాంబాబు విమర్శలు గుప్పించారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికి రాడని ఎద్దేవా చేశారు. పూలు, గజమాలలు వద్దని జనసేన లేఖ విడ్డూరంగా ఉందన్నారు. తనకు ఎమ్మెల్యే టికెట్ దక్కదని గోబెల్స్ ప్రచారం జరిగిందని మండిపడ్డారు. తాను అసెంబ్లీకి వెళ్లకుండా టీడీపీ, జనసేన, బీజేపీ అడ్డుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. 2019 ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కన్నా ఈ సారి ఒక్క ఓటు తగ్గినా తాను నైతికంగా ఓడినట్టేనని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి వైసీపీ అధికారంలోకి వస్తుందని.. జగన్ రెండోసారి సీఎం అవ్వడం ఖాయమని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.


