స్వతంత్ర వెబ్ డెస్క్: జనసేనాని, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ పాలిటిక్స్‌లో బిజీగా ఉన్నారు. ఆయన తలపెట్టిన ‘వారాహి విజయ యాత్ర’ మొదటి దశ ఇటీవలే సక్సెస్‌ఫుల్‌గా ముగిసింది. మరికొద్ది రోజుల్లో రెండవ దశ ప్రారంభం కానుంది. ఈ లోపుగా పవన్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ సెకండ్ షెడ్యూల్‌లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. పవన్ కళ్యాణ్ తన మూడో భార్య అన్నా లెజినోవాతో విడిపోయారనే న్యూస్ రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికే వాళ్లిద్దరూ సోషల్‌గా దూరంగా ఉంటున్నారని, త్వరలోనే లీగల్‌గా విడిపోనున్నారనేది ఆ వార్తల సారాంశం. ఈ న్యూస్‌తో పవన్ ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగే పరిణామాలు తలెత్తాయి. దీంతో విడాకుల వార్తను ఖండిస్తూ జనసేన అఫిషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి తాజాగా పోస్ట్ పెట్టింది. ఈ ప్రచారానికి జనసేన పరోక్షంగా చెక్ చెప్పే ప్రయత్నాలు చేసింది. వారాహి మొదటి విడత విజయవంతంగా పూర్తైనందున పవన్ దంపతులు తమ ఇంట్లో పూజలు నిర్వహించారు. ఈ క్రమంలో పవన్ – అనా దంపతుల ఫోటోను జనసేన సోషల్ మీడియాలో పోస్ట్ చేసి, తద్వారా విడిపోతున్నారనే వార్తలు అసత్య ప్రచారంగా తేల్చింది.
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీమతి అనా కొణిదెల గారు – వారాహి విజయ యాత్ర తొలి దశ దిగ్విజయంగా పూర్తి చేసుకొన్న సందర్భంగా హైదరాబాద్ లోని తమ నివాసంలో నిర్వహించిన పూజాదికాలలో పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా చేపట్టిన ఈ ధార్మిక విధులను శ్రీ పవన్ కళ్యాణ్, శ్రీమతి అనా కొణిదెల దంపతులు నిర్వర్తించారు. కొన్ని రోజుల్లో వారాహి విజయ యాత్ర తదుపరి దశ మొదలవుతుంది. ఇందుకు సంబంధించిన సన్నాహక సమావేశాల్లో పాల్గొనేందుకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో మంగళగిరి చేరుకుంటారు.’ అని పోస్ట్ పెట్టింది.
లేటెస్ట్ ట్వీట్‌తో పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న దుష్ప్రచారానికి చెక్ పెట్టినట్లయింది. అయితే ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా మారుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్‌ను జనాల్లో పలుచన చేసేందుకే అధికార పార్టీ నేతలు ఇలాంటి అసత్య ప్రచారాలకు పాల్పడుతున్నారని అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇదే సందర్భంగా పవన్ సోదరుడు నాగబాబు కూతురు నిహారిక కొణిదెల విడాకులపై అధికారిక ప్రకటన వెలువడటం కూడా ఆయనపై ఇలాంటి వార్తలకు ప్రచారం చేసేందుకు అవకాశం కల్పించిందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.


