చిత్తూరు జిల్లాలో బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు జనం. ఉన్న బస్సులన్నీ ఏపీ సీఎం జగన్ సభకు తరలి వెళ్తున్నాయని అంటున్నారు. పలమనేరు, కుప్పం, పుంగునూరు డిపోల నుండి గత మూడు రోజులుగా బస్సులు లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మండుటెండల్లో విద్యార్థులు సైతం బస్సుల కోసం అవస్థలు పడుతు న్నారు. కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో ఉన్న పలమనేరు నుంచి వెళ్లే వలస కూలీలకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సభల కోసం ప్రైవేటు బస్సులు వాడుకోవాలి కానీ.. ఇలా తమను ఇబ్బం దులు పెట్టడం సరికాదని ప్రయాణికులు మండిపడుతున్నారు.


