స్వతంత్ర వెబ్ డెస్క్: బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా – ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు రాఘవ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈ జంట ఇప్పుడు జంట పెళ్లి కోసం లొకేషన్ స్కౌటింగ్ మొదలు పెట్టారు. కొన్ని రోజుల క్రితం ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఏడాది చివరిలో జరగబోతున్న పెళ్లి కోసం పనులను మొదలు పెట్టేసారు ఇరు కుటుంబాలు. అన్నిటికన్నా ముఖ్యమైన పెళ్లి మండపం ఎక్కడ అనే విషయంలో సతమవుతుంది ఈ జంట. ఇటీవల రాజస్థాన్ విమానాశ్రంయలో పరిణీతి, రాఘవలు వివాహ వేదికను ఫిక్స్ చేయడానికి వివిధ ప్రదేశాలకు వెళ్తున్న వీడియోస్ సోషల్ మీడియాలో వైరలయ్యాయి. హిందూ సంప్రదాయ పద్దతిలో తమ పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు. కుటుంబ సంప్రదాయాలు, ఆచారాలు రెండు కుటుంబాలలో పెద్ద భాగం. అందుకే సాధ్యమైనంతవరకు తమ పెళ్లిని సాంప్రదాయంగా.. సన్నిహితులు, బంధువుల మధ్య జరగాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వీరి పెళ్లి ఉదయ్ పూర్ రాజభవనంలో జరుగుతుందని కొన్ని కథనాలు తెరపైకి వచ్చాయి.
మళ్ళీ ఇప్పుడు మరొక్క విషయం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతుంది. ప్రియాంక – నిక్ వివాహం జరిగిన రాజస్థాన్ జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ ను తమ వివాహ వేదికగా భావిస్తున్నారని తెలుస్తోంది. జోధ్ పూర్ లోని ఉమైద్ భవన్ ప్యాలెస్ కూడా ఒక మంచి ఎంపిక. విశాలమైన ఎయిర్ కండిషన్డ్ గదులు రాయల్టీ కోసం రూపొందించిన సూట్ లతో ఇది భారతదేశంలోనే అతిపెద్ద ప్యాలెస్ గా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వివాహ వేడుకలు అక్టోబర్ చివరి నుండి మొదటి వారం వరకు జరుగుతాయి. సంగీత్ – మెహందీ వేడుకలు ప్యాలెస్ హోటల్ లో జరుగుతాయి. ఆ తర్వాత సన్నిహితులు బంధువులతో ఘనమైన పార్టీ ఉంటుంది. వివాహానంతరం రెండు రిసెప్షన్ లలో ఒకటి ఢిల్లీ.. మరొకటి ముంబైలో జరగనున్నాయి. ప్రియాంక – నిక్ ల వివాహం గ్రాండ్ గా జరిగినప్పటికీ.. పరిణీతి – రాఘవ్ జంట పెళ్లి ప్రయివేటుగా ఉంటుందని తెలిసింది. బాలీవుడ్ నుండి కొంతమంది మాత్రమే ఈ పెళ్లికి హాజరుకానున్నారు. పెళ్లి ఏర్పాట్లలో పరిణీతి ప్రతి చిన్న విషయాన్ని స్వయంగా నిర్వహిస్తోంది అని తెలిసింది.


