విద్యార్థులంతా తల్లితండ్రులు, ఉపాధ్యాయులను ఆదర్శంగా తీసుకొని క్రమశిక్షణను అలవర్చు కోవాలని మంత్రి కందుల దుర్గేష్ సూచించారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకునేలా ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. విద్యార్థులు క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసి, తాము ఎంచుకున్న రంగంలో ఉన్నత స్థానంలో ఉండాలని మంత్రి ఆకాంక్షించారు. తూర్పు గోదావరి జిల్లా సమిశ్రగూడెం జెడ్పీ హైస్కూల్ విద్యార్థులకు పుస్తకాలు, బూట్లు, బ్యాగులతో కూడిన కిట్స్‌ను మంత్రి కందుల దుర్గేష్ అందజే శారు. ప్రైవేటు స్కూళ్లలో లేని సదుపాయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నాయని, సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.