Free Porn
xbporn
26.7 C
Hyderabad
Friday, October 25, 2024
spot_img

పాలస్తీనా – ఇజ్రాయెల్ వివాదం

పాలస్తీనా -ఇజ్రాయెల్‌ వివాదం చాలా పాతది. ఈ వివాదానికి చారిత్రక నేపథ్యం ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయింది. దీంతో పాలస్తీనాగా అందరూ పిలిచే సదరు భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసు కుంది. అయితే అప్పటికి ప్రపంచపటంపై ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఇది వాస్తవం. ప్రస్తుత ఇజ్రాయెల్ నుంచి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా అని అప్పట్లో పిలిచేవారు. పాలస్తీనాలో మెజారిటీ ప్రజలు అరబ్బులు. అయితే యూదులు కూడా ఉండేవారు. అయితే యూదుల సంఖ్య బహు స్వల్పం. పాలస్తీనాలో ఉన్నయూదులందరూ అక్కడి వారు కాదు. దాదాపుగా అందరూ బయటి నుంచి వచ్చిన వారే అంటారు చరిత్రకారులు.

ఆ తరువాతి కాలంలో పాలస్తీనాలో యూదుల సంఖ్య పెరిగింది. దీనికి ప్రధాన కారణం పాలస్తీనాకు వలసలు పెరగడ మే. 1920,1940ల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లోని యూదులపై దురాగతాలు పెరిగాయి. దీంతో ఎక్కడెక్కడి యూదులం దరూ ఆయా దేశాల నుంచి పాలస్తీనాకు వలస వచ్చారు. వీరిలో యూరప్ నుంచి వచ్చిన యూదులు భారీ సంఖ్యలో ఉన్నారు.ఆసక్తికరమైన విషయం ఏమిటంటే యూరప్ సహా అనేక ప్రాంతాల నుంచి వలస వచ్చిన యూదులు, పాలస్తీ నాను తమ పూర్వీకుల ఇల్లుగా భావిస్తుంటారు. అయితే పాలస్తీనాలోని యూదులకు బ్రిటన్‌తో సత్సంబంధాలు ఉండేవి . ఈ నేపథ్యంలో ఒక దేశమంటూ లేని యూదుల కోసం ఒక ప్రత్యేక దేశాన్ని ఏర్పాటు చేయాలని అప్పట్లో బ్రిటన్ ప్రభు త్వం నిర్ణయించుకుంది. దీనిని బ్రిటిష్ ఎత్తుగడ అంటారు చరిత్రకారులు. బ్రిటన్ ఎత్తుగడను పాలస్తీనా అరబ్బు లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో, పాలస్తీనా -ఇజ్రాయెల్ వివాదం తొలిసారిగా రాజుకుంది.

కాలక్రమంలో పాలస్తీనా -ఇజ్రాయెల్ వివాదం తీవ్రరూపం దాల్చింది. దీంతో 1947లో ఐక్యరాజ్యసమితి ఒక ప్రతిపాదన చేసింది. అరబ్బుల దేశంగా ఉన్న పాలస్తీనాను రెండుగా విభజించి, అందులో యూదులకు భాగం ఇవ్వాలని ఐక్య రాజ్యసమితి ప్రతిపాదించింది. యూదులకు పవిత్రభూమిగా పేరున్న జెరూసెలం, తన పర్యవేక్షణలో ఉంటుందని సమితి ప్రతిపాదించింది. అయితే తమ అస్థిత్వాన్ని దెబ్బతీసే పాలస్తీనా విభజనను అరబ్బులు వ్యతిరేకించారు. దీంతో ఐక్యరాజ్యసమితి ప్రతిపాదన అమలు కాలేదు. ఇదిలా ఉంటే అరబ్బు భూభాగంలోనే ఉంటూ ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచపటంపై లేని దేశాన్ని ప్రకటిస్తున్నట్లు యూదులు ప్రకటించారు. యూదుల ఈ నిర్ణయాన్ని మెజారిటీ పాలస్తీ నియన్లు వ్యతిరేకించారు. పాలస్తీనియన్ల అభ్యంతరాలను యూదులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 1948 మే 14న ఇజ్రాయెల్ పేరుతో ప్రపంచపటంపై ఓ కొత్త దేశం ఆవిర్బవించింది. ఈ పరిణామం చివరకు ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తొలి యుద్ధానికి దారి తీసింది. యుద్దంలో యూదులు పైచేయి సాధించారు. దీంతో ఏడున్నర లక్షలమంది పాలస్తీనియన్ల ప్రాణాలరచేత పట్టుకుని ఇతర ప్రాంతాలకు పారిపోయారు. 1949లో యుద్ధం ముగిసేనాటికి అతిపెద్ద భూభాగాన్ని ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. పాలస్తీనా స్వల్ప భూభాగానికే పరిమితమైంది.

తొలి యుద్దంలో జోర్డాన్ ఆధీనంలోకి వెళ్లిన పాలస్తీనా భూభాగానికి వెస్ట్ బ్యాంక్ అని పేరు పెట్టారు. అలాగే ఈజిప్టు ఆధీనంలోకి వెళ్లిన ప్రాంతానికి గాజా స్ట్రిప్ అని పేరు పెట్టారు. అంతేకాదు జెరూసలెంను రెండుగా విభజించారు. జెరూసలెం పశ్చిమ వైపు భాగాన్ని ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు భాగాన్ని జోర్డాన్ దళాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. 1948 యుద్ధం తరువాత ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య చాలా కాలంపాటు ప్రశాంత వాతావరణం నెలకొంది. అయితే 60ల్లో మరోసారి విభేదాలు చెలరేగాయి. దీంతో 1967లో ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య మరోసారి యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ మరోసారి విజేతగా నిలిచింది. తూర్పు జెరూసలెంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను ఇజ్రాయెల్ స్వాధీనం చేసుకుంది. ఇదిలాఉంటే, 2005లో గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ వైదొలగింది. అయితే కీలకమైన వెస్ట్ బ్యాంక్ ప్రాంతాన్ని ఇజ్రాయెల్ నియంత్రిస్తూనే ఉంది.

పాలస్తీనా – ఇజ్రాయెల్ వివాదం రక్తపుటేరులు పారించింది. ఇరువైపులా వేలాదిమంది ఉసురు తీసింది. ఈ నేపథ్యం లో ఇజ్రాయెల్ దాడుల నుంచి తమనుతాము రక్షించుకోవడానికి ఓ మిలిటెంట్ గ్రూప్ అవసరమని పాలస్తీనియన్లు భావించారు. ఈ నేపథ్యంలో 1987లో హమాస్ పేరుతో ఓ మిలిటెంట్ గ్రూపు ఏర్పటైంది. హమాస్‌ సంస్థను పాలస్తీనా మతపెద్ద షేక్ అహ్మద్ యాసిన్ ప్రారంభించారు.ఆ తరువాతి కాలంలో పాలస్తీనా – ఇజ్రాయెల్ వివాదంలోకి అగ్రరాజ్య మైన అమెరికా ప్రవేశించింది. పాలస్తీనా – ఇజ్రా యెల్ వివాదానికి చరమగీతం పాడాలని అమెరికా నిర్ణయించుకుంది. 2000లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఈ విషయంలో చొరవ చూపారు. శాంతి ప్రయత్నాలు ప్రారంభిం చారు. అప్పటి ఇజ్రాయెల్ ప్రధాని ఎహుద్ బరాక్, పాలస్తీనా పాలకుడు యాసర్ అరాఫత్ మధ్య శాంతి చర్చల కోసం ప్రయత్నించారు. అయితే బిల్ క్లింటన్ ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పాలస్తీనా – ఇజ్రాయెల్‌ మధ్య సంబంధాలు మరింతగా దెబ్బతిన్నాయి.

తూర్పు జెరూసలెం, గాజా, వెస్ట్ బ్యాంక్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ అనేకమంది పాలస్తీనియన్లు నివసిస్తున్నారు. ఈ పాలస్తీనియన్లకు, అక్కడి యూదులకు అనేక విషయాలపై తరచూ వివాదాలు తలె త్తేవి. దీంతో ఈ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనేవి. గాజా ప్రాంతమైతే పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ హమాస్ ఆధీనంలో ఉండేది. పాలస్తీనా ప్రజల ప్రయోజనాల కోసం ఇజ్రాయెల్ బలగాలతో హమాస్ అనేక సార్లు హోరాహోరీగా పోరాడింది. ఇదిలాఉంటే గతంలో హమాస్‌కు ఈజిప్ట్ నుంచి ఆయుధాలు అందేవి. ఈ నేపథ్యంలో ఇటీవలి యుద్ధంలో హమాస్‌కు ఆయుధాలు అందకుండా గాజా సరిహద్దుల్లో ఇజ్రాయెల్‌ గట్టి నిఘా ఏర్పాట్లు చేసింది. దీంతో ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు, పెడుతున్న ఆంక్షల వల్ల తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గాజా, వెస్ట్‌ బ్యాంక్ ప్రాంతాల్లోని పాలస్తీనియన్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పాలస్తీనియన్లు గోడును పట్టించుకునే తీరిక, ఓపిక ఇజ్రాయెల్ పాలకులకు లేకుండా పోయాయి.దశాబ్దాలు గడుస్తున్నా ఇప్పటికీ ఇజ్రాయెల్‌-పాలస్తీనా మధ్య అనేక విషయాల్లో తరచూ గొడవ లు వస్తున్నాయి. పాలస్తీనా శరణార్థుల సంగతి ఏమిటన్న ప్రశ్న తరచూ తెరమీదకు వస్తోంది. వెస్ట్‌ బ్యాంక్‌ లో యూదుల నివాసాలను తొలగించాలా? లేక కొనసాగించాలా? ఇలా అనేక అంశాల్లో ఇజ్రాయెల్ – పాలస్తీనా మధ్య తరచూ గొడవలు వస్తున్నాయి.

పాతికేళ్లుగా ఇజ్రాయెల్ -పాలస్తీనా వివాదానికి పరిష్కారం కనుక్కోవడంలో భాగంగా అనేకసార్లు శాంతి చర్చలు జరిగాయి. చర్చలైతే జరిగాయి కానీ రెండు దేశాల మధ్య ఇప్పటికీ శాంతి నెలకొనలేదు. ఎప్పుడు చూసినా ఉద్రిక్త పరిస్థితులే ఉండేవి. ఈ నేపథ్యంలో కిందటేడాది అక్టోబర్ ఏడవ తేదీన ఇజ్రాయెల్‌పై హమాస్ బలగాలు దాడి చేశాయి. దీంతో యుద్ధకాండ మొదలైంది. ఏమైనా ఇప్పటికైనా మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొనాలని ప్రపంచ శాంతిప్రియులు ఆశిస్తున్నారు.

Latest Articles

ఈప్యాక్ డ్యుర‌బుల్‌తో హైసెన్స్ ఒప్పందం

హైద‌రాబాద్‌, 25 అక్టోబర్ 2024: ప్రముఖ ఒప్పంద త‌యారీదారులైన ఈప్యాక్‌(EPACK) డ్యుర‌బుల్‌తో హైసెన్స్ సంస్థ ఒప్పందం చేసుకుంది. ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాలలో ప్ర‌పంచ వ్యాప్తంగా పేరున్న హైసెన్స్(Hisense) త‌న గృహోపకరణాలు, ఎయిర్ కండిషనర్ల మార్కెట్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్