Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

పాలమూరు – రంగారెడ్డిపై కాంగ్రెస్ ఆరోపణలు

   దక్షిణ తెలంగాణ వరదాయనిగా పేరొందిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. కరువుసీమగా పేరున్న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీటిని పారించే ప్రధాన లక్ష్యంతో ప్రారంభించిన పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ను గతంలోని కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదని కాంగ్రెస్ నాయకులు కొంతకాలంగా ఆరోపిస్తున్నారు. అంతేకాదు కమీషన్ల కోసం పాల మూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంచనా లను కేసీఆర్ సర్కార్ ఇష్టానుసారం పెంచిందని హస్తం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ చలో మేడిగడ్డకు కౌంటర్‌గా పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ను పరిశీలించారు కాంగ్రెస్ నేతలు.

    పది సంవత్సరాల కేసీఆర్‌ పాలనలో దక్షిణ తెలంగాణ ఎడారిగా మారిందని కాంగ్రెస్‌ సీనియర్ నేత వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల్లో వాటా విషయంలోనూ గత బీఆర్ఎస్ సర్కార్‌ విఫలమైంద న్నారు. ఒకవైపున ఆంధ్రాపాల కులు నీటిని తరలించుకుపోతుంటే మరోవైపు వారికి గులాబీ పార్టీ నేతలు సహకరించారని వంశీచంద్‌రెడ్డి విమర్శిం చారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ను మూడేళ్లలో పూర్తి చేస్తామని అప్పట్లో కేసీఆర్ ప్రజలకు మాటిచ్చారని వంశీ చంద్‌ రెడ్డి పేర్కొన్నారు. అయితే ఈ పదేళ్లలో కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్లిచ్చారా అని వంశీచంద్‌ రెడ్డి ప్రశ్నించారు. అయితే ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకుల్లో పశ్చాత్తాపం లేదని వంశీచంద్ రెడ్డి మండిపడ్డారు.బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో భారీఎత్తున అవినీతి జరిగిందని కాంగ్రెస్ నాయకులు కొంతకాలంగా తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాన్ని ఇప్పటికే రేవంత్ రెడ్డి నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి తీసుకువెళ్లింది. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ను గులాబీ పార్టీ సర్కార్ అట్టహాసంగా ప్రారంభించినప్పటికీ రైతులకు ఎటువంటి ఉపయోగం జరగలేదని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ నాయ కులు. ప్రాజెక్ట్‌కు సంబంధించి అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ఇప్పటివరకు అమలు కాలేదన్నారు హస్తం పార్టీ నేతలు.

     కేసీఆర్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ద్వారా తెలంగాణలో కనీసం ఒక్క ఎకరాకు కూడా సాగునీరు అందలేదని కాంగ్రెస్ నాయకులు అనేకసార్లు మండిపడ్డారు. ఈ విషయాన్ని మరింతగా తెలంగాణ సమాజంలోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఛలో పాలమూరు కార్యక్రమం పెట్టుకున్నారు హస్తం పార్టీ నేతలు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు తీవ్ర అన్యాయం జరిగిందని నిప్పులు కక్కారు కాంగ్రెస్ నేతలు. గులాబీ పార్టీ నిర్లక్ష్యానికి సంబంధించి ప్రజలకు ఆధారాలు చూపడమే తమ చలో పాలమూరు ప్రధాన ఉద్దేశమన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌కు 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. అయితే ఎన్నికల ప్రయోజనాల కోసమే కేసీఆర్ హడావిడిగా శంకుస్థాపన చేశారని హస్తం పార్టీ నేతలు ఘాటు ఆరోపణలు చేశారు.

      పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ కు సంబంధించి ఇన్నేళ్లుగా గులాబీ పార్టీ నేతలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. దొంగే…దొంగ అని అరిచినట్లు బీఆర్ఎస్ నేతలు వ్యవహరి స్తున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు కమిషన్ల కోసం కక్కుర్తి పడటమే తప్ప తెలంగాణ రైతుల సాగునీటి ప్రయోజనాలను పట్టించుకోలేదని నిప్పులు కక్కారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ గురించి కేసీఆర్ సర్కార్ గొప్పలు చెప్పుకుం టోందని కాంగ్రెస్ నేతలు మండిపడ్డారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయన్నారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌ ఫలితంగా రైతులెవరికీ ప్రయోజనం కలగలే దన్నారు. ఉమ్మడి మహ బూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాలను ఏమార్చడానికి ప్రాజెక్ట్‌ను కేసీఆర్ సర్కార్ ఉపయోగించు కుందన్నది కాంగ్రెస్ నాయకులు చేస్తున్న విమర్శ.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్