హైదరాబాద్ లో మంగళవారం రాత్రి భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. వర్షం ధాటికి నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో పెను ప్రమాదం తప్పింది. సుమారు 40మంది ప్రయాణికులు సాగర్ లోని పర్యాటక బోటులో బుద్ధుడి విగ్రహం దగ్గరికి వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో బోటు అదుపుతప్పి పక్కకు ఒరిగింది. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బోటు ప్రమాదం అంచున ఉందని గమనించిన సిబ్బంది వెంటనే స్పీడ్ బోట్ల సాయంతో పర్యాటకులను సురక్షితంగా ఒడ్డుకు తీసుకువచ్చారు. పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.
Visuals from Hyderabad Boat Club
Hussainsagar pic.twitter.com/2iTufv4TYe— HEMA (@Hema_Journo) April 26, 2023