లోక్‌సభ ఎన్నికల్లో తగిలిన ఎదురుదెబ్బతో కమలనాథుల్లో కలవరం మొదలైందా అంటే అవుననే సమా ధానం విన్పి స్తోంది. సొంతంగానే 370 సీట్లు సాధిస్తామని చెప్పుకున్న బీజేపీ కేవలం 240 స్థానాలకే పరిమితమైంది. దీంతో ఎక్కడె క్కడ లోటుపాట్లు జరిగాయి. ఏయే అంశాలను చక్కదిద్దుకోవాల్సి ఉంది అన్న దానిపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా పార్టీ పునర్‌వ్యవస్థీకరణపై దృష్టి సారించారు కమల నాథులు. మరోవైపు కేడర్ అతి విశ్వాసం వల్లే ఈ ఫలితా లు వచ్చాయంటూ చురకలు అంటించింది ఆరెస్సెస్.